జాతీయ వార్తలు

ఆదాయం పన్ను ఇక రద్దు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 16: నల్లధనం నియంత్రణ కోసమంటూ మోదీ ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దుకు నిర్ణయం తీసుకున్నప్పటినుంచి ప్రభుత్వం తదుపరి చర్య ఏమిటనే మాట వినిపిస్తోంది. పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై అటు సానుకూలంగా, ఇటు వ్యతిరేకంగా అభిప్రాయాలు వ్యక్తమవుతున్న తరుణంలో ప్రభు త్వం ఇంకేం చర్యలు తీసుకుంటుందోననే అలోచనలు సామాన్యుడిని ముప్పిరిగొంటున్నాయి. అయితే మో దీ ప్రభుత్వం ఆదాయం పన్నును పూర్తిగా రద్దు చేసి దాని స్థానంలో బ్యాంకింగ్ లావాదేవీలపై పన్ను విధించే విషయాన్ని ఆలోచించవచ్చని ఓ ఇంగ్లీషు న్యూస్ చానల్ అంటోంది. ఆ చానల్ కథనం ప్రకారం పుణెకు చెందిన ‘అర్థక్రాంతి ప్రతిష్ఠాన్’ అనే ఓ స్వచ్ఛంద సంస్థ దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి అయిదుప్రతిపాదనలను సిద్ధం చేసింది. అందులో పెద్ద నోట్ల నిర్ణయం మొదటిది.
ఈ ట్రస్టు వ్యవస్థాపకుడైన అనిల్ బొకిల్ గత ఏడాది ప్రధాని నరేంద్ర మోదీతో దాదాపు గంటన్నర సేపు సమావేశమయ్యారు. అప్పుడే పెద్ద నోట్ల రద్దు అంశం కూడా చర్చకు వచ్చిందట. అప్పుడు బొకిల్ ఈ అయిదు ప్రతిపాదనలను మోదీ ముందుంచారు. వాటిలో ఒకటయిన నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రభుత్వం ఇప్పటికే అమలు చేసింది. ఈ వరసలో రెండవది ఆదాయం పన్నును పూర్తిగా రద్దు చేసి దాని స్థానంలో బ్యాంక్ లావాదేవీలపై పన్ను విధించడమేనని ఆ చానల్ పేర్కొంది.
అన్ని ప్రత్యక్ష, పరోక్ష పన్నుల స్థానంలో బ్యాకింగ్ లావాదేవీల పన్ను(బిటిటి)ని విధించాలన్నది ఈ ప్రతిపాదన చేసిన వారి సూచన. అలా చేయడం వల్ల ఇప్పుడు పన్నుల ద్వారా వచ్చే రాబడికన్నా ఎక్కువే రావడమే కాకుండా అవినీతిని సైతం అదుపు చేయవచ్చనేది వారి వాదన. బ్యాంకింగ్ లావాదేవీల పన్నును విధించడం వల్ల దేశానికి దాదాపు 40 లక్షల కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని, ఇది ఇప్పుడున్న పన్నుల విధానం ద్వారా వచ్చే ఆదాయానికన్నా ఎక్కువ అనేది వారి అంచనా. అయితే మోదీ ప్రభుత్వం ఈ ప్రతిపాదనను పాటిస్తుందా లేదా అనేదే ప్రశ్న. అయితే సుబ్రహ్మణ్య స్వామి లాంటి బిజెపి నేతలు సైతం ఆదాయం పన్నును రద్దు చేయాలని కోరుతుండడం గమనార్హం.