జాతీయ వార్తలు

తిండి లేదు.. కునుకు రాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 16: వారి సేవలు నిరుపమానం... విద్యుక్త్ధర్మం అనిర్వచనీయం... గంటలు, రోజులు, వారాలు... వారంతా ఇళ్లకు దూరం. ఇంట్లో చిన్నారులు, భార్యాపిల్లల గురించి తెలుసుకునే తీరిక కూడా వారికి లేదు. తమ ఇళ్లల్లో చిల్లిగవ్వ ఉందో లేదో తెలియకపోయినా ఎటిఎంలను సకాలంలో నింపుతూ జనానికి నగదు భరోసా ఇస్తున్నారు. తమ పొట్ట నిండకపోయినా, కుటుంబం ఎలా ఉందో తెలియకపోయినా జనానికి సకాలంలో నగదును అందిస్తున్నారు. వారే లక్షలాదిగా ఎటిఎంల వద్ద శ్రమను భరిస్తూ రోజుల తరబడి విధులు నిర్వహిస్తున్న గార్డులు, దూరాభారం లేకుండా నగదును తరలించే డ్రైవర్లు. వేలాదిగా ఈ గార్డులు, డ్రైవర్లు నిరంతరం శ్రమిస్తూ జనం ఇబ్బందిని శక్తివంచన లేకుండా కొంతమేర అయినా తగ్గిస్తూ చేస్తున్న కృషి, సేవకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ‘తాము గంటల తరబడి క్యూలో నిలబడలేకపోతున్నామంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ ప్రభుత్వంపై కనె్నర్ర చేస్తున్న అన్ని వర్గాల పౌరుల్ని చూశాం. కానీ ఎంత అసౌకర్యమున్నా నిలబడే శక్తి, కూర్చునేందుకు కుర్చీ లేకపోయినా అదే పనిగా విధులను నిర్వహిస్తున్న ఈ వేలాదిమంది గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. 500, 1000 నోట్ల చెలామణిని రద్దుచేస్తూ ప్రధాని తీసుకున్న చారిత్రక నిర్ణయం సాకారం కావడానికి ఎటిఎంలను కాపుకాస్తున్న గార్డులు, సకాలంలో కోటానుకోట్ల నగదును నిర్దేశిత బ్యాంకులకు తరలిస్తున్న డ్రైవర్ల కృషి ఎంతో ఉంది. ఎంత శ్రమ ఉన్నా, ఎన్ని ఇబ్బందులున్నా దీన్నో బాధ్యతగా విధ్యుక్త్ధర్మంగా రాత్రింబవళ్లు ఆయా బ్యాంకులు, ఎటిఎంల వద్దే ఈ గార్డులు గడుపుతున్నారు. ఇక కరెన్సీని తీసుకెళ్లే డ్రైవర్లు కునుకుతీస్తే ఎక్కడ ఆలస్యమవుతోందోనన్న, ఎక్కడ కరెన్సీ అందక జనం ఇబ్బంది పడతారోనన్న ఆందోళన నిరంతరం కనిపిస్తోంది. ఈ రకంగా 24 గంటలూ గత ఎనిమిది రోజులుగా వీరు విధులను నిర్వహించడం వారి వారి కుటుంబాలకు తీవ్ర స్థాయిలో నిరాశా నిస్పృహలను కలిగిస్తున్నప్పటికీ వీరంతా కూడా సామాజిక పరివర్తన కోసం మోదీ తీసుకున్న నిర్ణయాన్ని సాకారం చేయడంలో తామూ తోడ్పడుతున్నామన్న సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ‘ప్రధాని మోదీ తలపెట్టిన యజ్ఞం పూర్తయిన వెంటనే ఇంటికొచ్చేస్తాను’ అంటూ అమృత్‌సర్‌కు చెందిన హరీశ్ పాలీవాల్ తన ఇద్దరు చిన్నారులకు నచ్చచెప్పడం విధుల పట్ల అతని బాధ్యతను స్పష్టం చేసేదే. ఇది నల్లధనానికి వ్యతిరేకంగా, అవినీతి నిర్మూలనకు ఉద్దేశించిన బృహత్కార్యం కాబట్టి ఇందులో తాము పడుతున్న శ్రమ కంటే అనుకున్నది సాధించడమే ముఖ్యమని తెలిపాడు.
నిరంతరం నగదు వ్యాన్లలోనే తాను గార్డుగా ప్రయాణిస్తున్నానని పాలీవాల్ చెబుతుంటే తాను ఇంటికెళ్లి నాలుగు రోజులైందని మరో వ్యాన్ డ్రైవర్ వికాస్ పాండే అంటున్నారు. ఇంటికెళ్లాలన్న ఆలోచనే రానంత పనిఒత్తిడిలో ఉన్నట్లు తెలిపారు. ఈ బృహత్కార్యంలో భాగం కావడాన్ని మించిన ఆనందం మరొకటి లేదని, ఇందుకు తన కుటుంబ సభ్యులు సహకరిస్తున్నారని తెలిపారు.