జాతీయ వార్తలు

మోదీ ‘స్నేహితుల’పై చర్యలేవీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, నవంబర్ 16: పెద్ద నోట్ల రద్దు విషయంలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. నిజమైన నల్లధన కుబేరులు, నరేంద్ర మోదీని తమ విమానాలలో తిప్పిన, రూ.పది వేల కోట్ల నుంచి 20వేల కోట్ల వరకు గల వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. వీరెవరిపైనా ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని ఆయన ధ్వజమెత్తారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) దాఖలు చేసిన పరువునష్టం కేసులో బుధవారం థానే జిల్లా భివాండి కోర్టుకు హాజరయిన రాహుల్ గాంధీ కోర్టు వెలుపల విలేఖరులతో మాట్లాడుతూ ‘మోదీజీ పారిశ్రామిక స్నేహితులకు వ్యతిరేకంగా ఎలాంటి దర్యాప్తు లేదు. చర్య లేదు’ అని దుయ్యబట్టారు. భివాండి కోర్టు నుంచి తిరిగి వచ్చేటప్పుడు ముంబయి శివార్లలోని వకోల ప్రాంతంలో గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ)కు చెందిన ఒక ఎటిఎం వద్ద ఆయన అకస్మాత్తుగా ఆగిపోయారు. ఎటిఎం వద్ద పెద్ద సంఖ్యలో క్యూలైన్‌లో నిలుచున్న ప్రజలకు ఆయన సంఘీభావం ప్రకటించారు. ‘మిమ్మల్ని క్యూలో నిలబెడుతున్నారు. మీ డబ్బును ఎంపిక చేసిన 15నుంచి 20 మంది పారిశ్రామికవేత్తలకు ఇస్తున్నారు. మీకందరికీ వారి పేర్లు తెలుసు. అతను (మోదీ) వారి ప్రభుత్వాన్ని నడుపుతున్నారు’ అని రాహుల్ గాంధీ ప్రజలను ఉద్దేశించి అన్నారు. అంతకుముందు భివాండి కోర్టు వద్దకు తరలివచ్చిన కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ బ్యాంకులు, ఎటిఎంల వద్ద పెద్ద సంఖ్యలో క్యూలలో నిలబడటం ద్వారా సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ‘క్యూలో నిలబడిన వారంతా సామాన్య ప్రజలే. ధనవంతుడిని ఎవరినయినా చూశారా? బడా పారిశ్రామికవేత్త ఎవరయినా క్యూలో నిలబడ్డారా?’ అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ‘మీకు రూ.4వేల నోట్లు దొరికాయా? మీ వ్రేళ్లపై మాయని సిరా గుర్తు పెట్టారా?’ అని ఆయన ప్రశ్నించారు. ఎటిఎం వద్ద క్యూలో నిలబడిన ప్రజలతో మాట్లాడిన రాహుల్ గాంధీ నగదు తీసుకోవడానికి వారు పడుతున్న ఇబ్బందులను తెలుసుకున్నారు.

పరువు నష్టం కేసులో
రాహుల్‌కు బెయిల్

భివాండీ, నవంబర్ 16: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీకి స్థానిక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మహాత్మాగాంధీ హత్యవెనక ఆర్‌ఎస్‌ఎస్ ఉందని వ్యాఖ్యానించిన రాహుల్ పరువునష్టం కేసును ఎదుర్కొంటున్నారు. కేసు విచారణలో భాగంగా థానే జిల్లా భివాండీ కోర్టుకు బుధవారం ఆయన హాజరయ్యారు. గాంధీ సిద్ధాంతాలపై తాము పోరాడుతున్నామని కోర్టు వెలుపల కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్దేశించి రాహుల్ చెప్పారు. 2014 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో ఆర్‌ఎస్‌ఎస్‌పై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు పలు ఆరోపణలు చేశారు. దీనిపై స్థానిక ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త రాహుల్‌పై పరువునష్టం కేసు పెట్టారు. జాతిపిత మహాత్మాగాంధీ సిద్ధాంతాలు, ఆయన బాటలో తాము నడుస్తున్నామని రాహుల్ చెప్పారు. తప్పుడు కేసులకు తాను భయపడనని ఆయన ప్రకటించారు. దేశంలో విద్వేషాలు రెచ్చగొట్టాలన్న శక్తులపై తన పోరాటం ఆగదని భివాండీ మెజిస్ట్రేట్ కోర్టు ఎదుట ఆయన ప్రకటించారు. బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌లపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు తీవ్రమైన విమర్శలు చేశారు. భారీ భద్రత మధ్య ఉదయం 10.30 గంటలకు రాహుల్ కోర్టుకు హాజరయ్యారు. కేసు విచారించిన న్యాయమూర్తి తుషార్ వాజే కాంగ్రెస్ ఉపాధ్యక్షుడికి బెయిల్ మంజూరు చేస్తూ తదుపరి విచారణను 2017 జనవరి 30కి వాయిదా వేశారు. మాజీ కేంద్ర మంత్రి శివరాజ్ పాటిల్ ష్యూరిటీ ఇచ్చారు.