జాతీయ వార్తలు

14 వేల మందిని తొలగించిన ఎల్‌అండ్‌టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, నవంబర్ 23: ఇంజినీరింగ్ దిగ్గజం లార్సెన్ అండ్ టూబ్రో (ఎల్‌అండ్‌టి) ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) ఏప్రిల్- సెప్టెంబర్ కాలంలో ఏకంగా 14 వేల మంది ఉద్యోగులను తొలగించింది. ఆర్థిక ప్రతికూల పరిస్థితుల కారణంగానే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని సంస్థ స్పష్టం చేసింది. వ్యాపారం లాభదాయకంగా లేనప్పుడు ఇలాంటి నిర్ణయాలు సాధారణమేనని, వ్యూహాత్మక నిర్ణయాల్లో ఈ చర్యలు భాగమని సంస్థ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ఆర్ శంకర్ రామన్ అన్నారు. వ్యాపార పరిస్థితులు కుదుటపడి అనుకూలంగా ఉన్నప్పుడు కొత్త ఉద్యోగులను తీసుకోవడం పరిపాటేనని చెప్పుకొచ్చారు.
కాగా, ఈ ఏప్రిల్-సెప్టెంబర్‌లో సంస్థ ఆదాయం 8.6 శాతం పెరిగి 46,885 కోట్ల రూపాయలుగా నమోదైంది. లాభాలు కూడా నిరుడుతో పోల్చితే 1,197 కోట్ల రూపాయల నుంచి 2,044 కోట్ల రూపాయలకు పెరిగాయి. అయినప్పటికీ వ్యాపార ఒడిదుడుకుల పేరుతో ఇంత పెద్ద ఎత్తున ఉద్యోగులను ఎల్‌అండ్‌టి తొలగించడం ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకుంది.

లోక్‌పాల్ నియామకం ఎప్పుడు?
కేంద్రంపై సుప్రీం అసంతృప్తి

న్యూఢిల్లీ, నవంబర్ 23: లోక్‌పాల్ నియమకంలో కేంద్ర ప్రభుత్వం జాప్యం చేయడంపై సుప్రీం కోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. లోక్‌పాల్ బిల్లు సవరణకు సంబంధించిన బిల్లుకు పార్లమెంటు ఆమోదం లభించని విషయాన్ని కేంద్రం తెలిపింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి టిఎస్ ఠాకూర్ నేతృత్వంలోని జస్టిస్ డివై చంద్రచుడ్, జస్టిస్ ఎల్ నాగేశ్వరరావుధర్మాసనం బుధవారం లోక్‌పాల్‌పై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. లోక్‌పాల్‌కు నియామకాలు జరపుతూ న్యాయస్థానం ఎందుకు ఆదేశాలు ఇవ్వకూడదని అటార్నీ జనరల్ ముకుల్ రొహత్గిని ప్రశ్నించింది. ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుడిని లోక్‌పాల్‌కు నియమించాల్సి ఉంటుంది. కేసును డిసెంబర్ 7కు వాయిదా వేసిన ధర్మాసనం ఆరోజు సమగ్ర సమాచారంతో రావాలని ఎజిని ఆదేశించింది. నియాకమంపై కోర్టు ఆదేశాలు ఇవ్వడానికి న్యాయపరమైన చిక్కులున్నాయని రొహత్గి స్పష్టం చేశారు. కాగా సుదీర్ఘకాలం పోరాడి సాధించినకున్న లోక్‌పాల్‌ను కేంద్రం ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేస్తోందని ప్రముఖ న్యాయవాది శాంతి భూషణ్ ఆరోపించారు. ‘కామన్‌కాజ్’అన్న స్వచ్ఛంద సంస్థ తరఫున భూషణ్ తన వాదనలు వినిపించారు. 2014 సంవతసరంలో లోక్‌పాల్‌పై నోటిఫికేషన్ ఇచ్చారని, ఇప్పటివరకూ అతీగతీలేకుండా పోయిందని ఆయన దుయ్యబట్టారు. కనీసం న్యాయకోవిధుడినే నియమించలేకపోయిందని, దీనిపై ప్రజలంతా తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ఆయన కోర్టుకు తెలిపారు. మరో అన్నాహజారే ఆందోళన చేయాలా? అంటూ ఆయన అడిగారు. లోక్‌పాల్ సవరణ బిల్లు పార్లమెంటులో పెండింగ్‌లో ఉన్నందున నియామకంలో జాప్యం నెలకొందని అటార్నీ జనరల్ తెలిపారు. సుప్రీం కోర్టు జోక్యం చేసుకుని ఎంపిక కమిటీ సమావేశానికి ఆదేశాలివ్వాలని శాంతి భూషణ్ విజ్ఞప్తి చేశారు.