జాతీయ వార్తలు

గర్భిణి ప్రాణం తీసిన పాత నోటు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాట్నా, నవంబర్ 25:రద్దయిన 500నోటును చికిత్స కోసం ఆసుపత్రి వర్గాలు స్వీకరించక పోవడం వల్ల గయలో ఓ గర్భిణి మరణించిన సంఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ మేరకు మీడియాలో వచ్చిన కథనాలను స్వీకరించిన బీహార్ మానవ హక్కుల సంఘం జిల్లా మెజిస్ట్రేట్, సంబంధిత ఆసుప్రతి వర్గాలపై నిప్పులు చెరిగింది. పక్షం రోజుల్లో తమకు నివేదిక అందించాలని ఆదేశించింది. గయలోని ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఆసుపత్రిలోనే ఈ సంఘటన జరగడం తీవ్ర దిగ్భ్రాంతి కలిగిస్తోందని మానవ హక్కుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. మూత్రం ఆగిపోయిన కారణంగా ఆ గర్భిణికి డయాలిసిస్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. రోజువారి కూలిగా పనిచేస్తున్న ఆమె భర్త ఎన్‌ఎమ్‌ఎమ్‌సిహెచ్ ఆసుత్రికి తీసుకొచ్చాడని, అతడి వద్ద రద్దయిన 500నోటే ఉండటంతో దాన్ని ఆసుపత్రి వర్గాలు అంగీకరించక పోవడం వల్ల..సకాలంలో చికిత్స జరుగక సదరు గర్భిణి మరణించినట్టు వార్తలు వచ్చాయి.
నవంబర్ 24వరకూ పాత కరెన్సీని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులూ అంగీకరించాలని కేంద్రం తన ఉత్తర్వులో స్పష్టం చేసినప్పటికీ దాన్ని సదరు ఆసుపత్రి ఖాతరు చేయలేదని మానవ హక్కుల సంఘం సభ్యురాలు నీలమణి తెలిపారు.