జాతీయ వార్తలు

దీర్ఘకాలిక మార్పులు అనివార్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 7: ఆర్థికపరమైన మార్పులు రాత్రికి రాత్రే వచ్చే అవకాశం ఉండదు.. కాని అందుకు సంబంధించిన అజెండా, రోడ్‌మ్యాప్‌లను ఏర్పరచక తప్పదని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. దేశంలో 500, 1000 నోట్లను రద్దుచేస్తూ తీసుకున్న నిర్ణయ పర్యవసానాలను ఎదుర్కొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ సిద్ధంగా ఉన్నారని బుధవారం ఇక్కడ జరిగిన పెట్రోటెక్ సదస్సులో జైట్లీ ఉద్ఘాటించారు. భారత ఆర్థిక వ్యవస్థలో దీర్ఘకాలిక మార్పులు అనివార్యమని తెలిపారు. గతంలో దేశ ఆర్థిక పరిస్థితికి తాజాగా మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఎదురవుతున్న వాతావరణానికి ఎంతో తేడా ఉందని వెల్లడించారు. ఏడు దశాబ్దాలుగా కొనసాగుతూ వచ్చిన పరిస్థితుల్లో అవసరానుగుణంగా మార్పులు చేయాల్సిన అగత్యం ఏర్పడిందని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే పెద్దనోట్లను రద్దుచేస్తూ చారిత్రక నిర్ణయం తీసుకున్న మోదీ దాని పర్యవసానాలను భుజానికి ఎత్తుకునేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఈ రకమైన నిర్ణయాలవల్ల ఎంతో బాధ ఉన్నప్పటికీ ఇది విస్తృత మార్పుల్లో భాగమే కాబట్టి భరించక తప్పదని జైట్లీ అన్నారు. బ్యాంకింగ్ వ్యవస్థలో ఎంతగా నగదు ఉంటే, బ్యాంకుల సామర్థ్యం ఎంతగా పెరిగితే దేశ ఆర్థిక వ్యవస్థ కూడా అంతగానూ శక్తివంతమవుతుందని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు.
అంతేకాకుండా ఎలాంటి లావాదేవీనైనా పన్నుల పరిధిలోకి తీసుకురావడం ద్వారా ప్రభుత్వ ఆదాయాన్ని పెంచేందుకూ అవకాశాలుంటాయని తెలిపారు.