జాతీయ వార్తలు

మార్పుకే ఓటేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హల్‌ద్వానీ, డిసెంబర్ 7: ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం పారదర్శకత పాలన సాగుతోందని బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఉద్ఘాటించారు. బిజెపి ప్రారంభించిన పరివర్తన యాత్ర బుధవారం ఉత్తరాఖంఢ్‌లో ముగిసింది. దేశ ప్రజలు మార్పునకు ఓటేయాలని ఈ సందర్భంగా షా పిలుపునిచ్చారు. వ్యవస్థలో మార్పుకోసమే బిజెపి పరివర్తన యాత్రకు శ్రీకారం చుట్టిందని ఆయన స్పష్టం చేశారు. ‘పరివర్తన యాత్ర అంటే ముఖ్యమంత్రిని మార్చడానికి కాదు. పారదర్శకత, సుపరిపాలనకోసం సమర్థవంతంగా పనిచేయడానికి’ అని ఆయన పేర్కొన్నారు. అవినీతి ప్రభుత్వాన్ని సాగనంపాల్సిందేనని ఆయన చెప్పారు. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారం చేపట్టాక అనేక కీలక నిర్ణయాలు తీసుకుందని షా తెలిపారు. అవినీతిని రూపుమాపడంతోపాటు పారదర్శకత, జవాబుదారీతనంకోసం చర్యలు తీసుకున్నట్టు ఆయన అన్నారు. మోదీ అభివృద్ధికే పెద్దపీట వేశారని ఆయన వివరించారు. పర్వత ప్రాంతమైన ఉత్తరాఖండ్ రాష్ట్రం అభివృద్ధికి బిజెపి హయాంలోనే బీజం పడిందని ఆయన స్పష్టం చేశారు. ఎబి వాజపేయి హయాంలోనే పర్యాటక రంగం అభివృద్ధికి కృషి జరిగినట్టు అమిత్ షా చెప్పారు. వాజపేయి కన్న కలలు సాకారం కావాలంటే బిజెపికే ఓటు వేయాలని ఆయన పిలుపునిచ్చారు. చార్‌ధామ్‌ను నాలుగులేన్ల రహదారిగా అనుసంధానం చేయాలన్నని మోదీ లక్ష్యమని ఆయన ప్రకటించారు. ఉత్తరాఖండ్‌లో నిర్వహించిన మూడు పరివర్తన ర్యాలీలకు ప్రజలు పెద్దఎత్తున తరలిరావడాన్ని చూస్తే అవినీతి ప్రభుత్వాన్ని గద్దెదింపాలన్న కసి వాళ్లలో కనిపిస్తోందన్నారు. పెద్దనోట్ల రద్దువల్ల కేవలం నల్లకుబేరుల్లోనే భయం నెలకొందని, సామాన్యులకు ఎలాంటి ఇబ్బందీ లేదని అమిత్ షా అభిప్రాయపడ్డారు. ఓఆర్‌ఓపి పథకంపై కాంగ్రెస్ చేస్తున్న విమర్శల్లో పసలేదని ఆయన ధ్వజమెత్తారు. మోదీ ప్రభుత్వం వచ్చాకే మాజీ సైనికుల పెన్షన్ పథకానికి విముక్తి లభించిందని ఆయన గుర్తుచేశారు.