జాతీయ వార్తలు

ఇది ఆర్థిక పరివర్తన శకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 14: వ్యవస్థను నల్లధనం, అవినీతినుంచి స్వచ్ఛపరచడమే తన ప్రధాన అజెండా అని, ఉపాధి కల్పన, స్వయం ఉపాధి అవకాశాల దిశగా ముందుకు సాగడం తన లక్ష్యమని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ‘్భరతదేశంలో ప్రస్తుతం ఆర్థిక పరివర్తన చోటు చేసుకుంటోంది. మేము ఇప్పుడు డిజిటల్, నగదురహిత ఆర్థిక వ్యవస్థ దిశగా ముందుకు సాగుతున్నాం’ అని కౌలాలంపూర్‌లో జరుగుతున్న ఎకనామిక్ టైమ్స్ ఆసియన్ బిజినెస్ లీడర్ల సదస్సు-2016ను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్‌లో మోదీ స్పష్టం చేశారు. మలేసియా ప్రధాని నజీబ్ రజాక్ కూడా సదస్సులో పాల్గొంటున్నారు. ‘ప్రస్తుతం నల్లధనం, అవినీతి నుంచి వ్యవస్థను స్వచ్చపరచడమే ప్రధాన అజెండా’గా మోదీ చెప్పారు. 500, వెయ్యి నోట్లను రద్దు చేస్తున్నట్టు గత నెల 8న ప్రధాని ప్రకటించిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. దేశంలో ఆర్థిక వ్యవస్థ ఉపాధి అవకాశాల సృష్టి, స్వయం ఉపాధి అవకాశాలకు కీలకమైన కార్యకలాపాల దిశగా సాగుతోందన్నారు.
పెద్ద ఎత్తున విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డిఐ) ఆకర్షించడానికి పలు చర్యలు తీసుకోన్నట్టు చెప్పిన మోదీ, ఈ దిశగా తీసుకున్న చర్యలను వివరించారు. దేశంలో పరోక్ష పన్నుల విధానంలో సమూలమైన మార్పును తీసుకొచ్చే వస్తు సేవల పన్ను (జిఎస్‌టి) అమలు కోసం రాజ్యాంగ సవరణ చేపట్టామన్నారు. ‘2017లో ఇది అమలవుతుందని భావిస్తున్నా. ఇప్పటివరకు భారత్‌లో లేనివారిని మా దేశానికి ఆహ్వానిస్తున్నాం. భారత దేశం పెట్టుబడులకు మంచి గమ్యమే కాదు, భారత్‌లో ఉండటం ఎప్పుడూ మంచి నిర్ణయం అవుతుంది’ అన్నారు. ఎఫ్‌డిఐల కోసం కొత్త రంగాల తలుపులు తెరిచామని, ఇప్పటికే ఉన్నవాటికి పరిమితులు విస్తృతం చేశామన్నారు. గత రెండేళ్లలో దేశంలోకి వచ్చిన ఎఫ్‌డిఐలు 130 బిలియన్ డాలర్లుగా వివరించారు. విధానాలు, నియంత్రణ, పెట్టుబడులకు సంబంధించిన సానుకూల మార్పును విదేశీ పెట్టుబడిదారులూ గుర్తించారన్నారు. ‘మేక్ ఇన్ ఇండియా’ను ప్రస్తావిస్తూ ఉత్పాదక, డిజైన్, నూతన ఆవిష్కరణల విషయంలో భారత్‌ను అంతర్జాతీయ కేంద్రం చేయడం లక్ష్యమని వివరించారు.
దేశంలో ఇప్పుడు గతంలో ఎన్నడూ లేనంతగా పారిశ్రామిక కార్యకలాపాలు కొనసాగుతున్నాయని, ఇప్పుడు తాము ప్రపంచంలోనే ఆరవ అతిపెద్ద ఉత్పాదక దేశంగా నిలిచామన్నారు. దేశంలో వ్యాపార నిర్వహణ సులభతరం చేసే దిశగా ఎన్నో చర్యలు చేపట్టామని చెప్తూ, లైసెన్సింగ్ విధానాన్ని ప్రభుత్వం ఎంతగానో హేతుబద్దం చేసిందన్నారు. అనుమతులకు సంబంధించి ఏకగవాక్ష విధానం తీసుకొచ్చిందని వివరించారు. కాగా స్టార్టప్‌లు ఇప్పుడు దేశంలో బలమైన ఆర్థిక శక్తిగా మారుతున్నాయని, ఇదో విప్లవంగా తయారవుతోందన్నారు. వౌలిక సదుపాయాలకు సంబంధించిన ఇబ్బందులు తొలగించే విషయంపైనా దృష్టి పెడుతున్నామని, రోడ్లు, రైల్వేలు, రేవులను దేశవ్యాప్తంగా ఆధునీకరించడంతో పాటుగా సామర్థ్యాన్ని పెంచడం జరుగుతోందని ప్రధాని నరేంద్ర మోదీ వివరించారు.