జాతీయ వార్తలు

జమ ఎంతయినా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 21: పాతనోట్ల డిపాజిట్ నిబంధనలపై రిజర్వ్ బ్యాంక్ వెనక్కి తగ్గింది. డిసెంబర్ 30 దాకా రద్దయిన పాతనోట్లతో 5 వేల రూపాయలకు పైబడిన డిపాజిట్లను ఒక్క సారి మాత్రమే చేసుకోవచ్చంటూ రిజర్వ్ బ్యాంక్ గత సోమవారం ప్రకటించిన విషయం తెలిసిందే. అంతేకాదు, ఈ సందర్భంగా ఇంతవరకు పాతనోట్లను ఎందుకు డిపాజిట్ చేయలేదని బ్యాంక్ అధికారులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుందని కూడా పేర్కొంది. అయితే దీనిపై అన్ని వర్గాలనుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆర్‌బిఐ బుధవారం ఈ నిబంధనల్లో మార్పులు చేసింది. కెవైసి వివరాలు ఉన్న ఖాతాదారులను ఎలాంటి ప్రశ్నలు అడగరని, వారు ఒకసారి కానీ, ఎన్నిసార్లయినా పాతనోట్లను తమ ఖాతాల్లో డిపాజిట్ చేసుకోవచ్చని ఆర్‌బిఐ తెలిపింది. అయితే కెవైసి వివరాలులేని ఖాతాలు కలిగిన కస్టమర్లకు మాత్రం ఈ నెల 19న ఆర్‌బిఐ ప్రకటించిన కఠినమైన నిబంధనలు వర్తిస్తాయని, వీరు 50 వేల రూపాయల వరకు మాత్రమే ఈ నిబంధనలకు లోబడి తమ ఖాతాల్లో డిపాజిట్ చేసుకోవచ్చని ఆర్‌బిఐ ఆప్రకటనలో తెలిపింది. ఈ నెల 0 వరకు రూ. 5 వేలకు పైబడిన విలువ కలిగిన రద్దయిన పాత నోట్లను కేవలం ఒక్కసారే తమ ఖాతాల్లో జమ చేసుకోవచ్చని ఆర్‌బిఐ సోమవారం నాడు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ నిబంధనలను రద్దు చేసింది. కెవైసి వివరాలున్న ఖాతాదారులు డిసెంబర్ 30 వరకు 5 వేల రూపాయలకు పైబడిన రద్దయిన పాతనోట్లను ఎన్నిసార్లయినా జమ చేసుకోవచ్చని స్పష్టం చేసింది. కెవైసి వివరాలు సక్రమంగా లేని ఖాతాల్లో మాత్రం రూ. 50 వేల విలువ చేసే పాతనోట్లను మాత్రమే అనుమతిస్తారు.