జాతీయ వార్తలు

విదేశీ టూర్లు తగ్గిస్తా..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 1: తరచూ విదేశీ పర్యటనలు చేస్తున్నారంటూ విపక్షాల నుంచి విమర్శలను ఎదుర్కొంటున్న ప్రధాని నరేంద్ర మోదీ కొత్త ఏడాదిలో విదేశీ పర్యటనలను వీలైనంత తగ్గించుకోవాలని నిర్ణయించుకున్నారు. 2016లో అత్యవసరమైతేనే మోదీ విదేశాలకు వెళ్తారు. 2016లో ప్రధాని విదేశీ కార్యక్రమాలు వీలైనంత తక్కువగా ఉండేలా చూడాలని ప్రధానమంత్రి కార్యాలయం (పిఎంఓ) విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను కోరినట్టు ‘హిందుస్థాన్ టైమ్స్’ పత్రిక కథనం పేర్కొంది. ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది తొలి అర్ధ్భాగంలో ప్రధానికి కేవలం రెండు విదేశీ పర్యటనలు మాత్రమే ఉన్నాయి. విదేశీ పర్యటనలను తగ్గించుకోవాలని ప్రధాని తీసుకున్న నిర్ణయంవల్ల దేశంలోని సమస్యలపైన, రాబోయే బడ్జెట్ సమావేశాలపైన ఎక్కువ దృష్టి పెట్టడానికి వీలవుతుంది. ప్రధాని నరేంద్ర మోదీ తరచూ విదేశీ పర్యటనలకు వెళ్తూ ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని, దేశంలోని సమస్యలను పట్టించుకోవడం లేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్న విషయం తెలిసిందే.