జాతీయ వార్తలు

‘చేయి’ కలపాలా? వద్దా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, జనవరి 1: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం విషయంలో సిపిఎం, దాని నేతృత్వంలోని లెఫ్ట్ ఫ్రంట్ రెండుగా విడిపోయినట్లు కనిపిస్తోంది. అధికార తృణమూల్ కాంగ్రెస్‌ను ఓడించేందుకు సిపిఎం, కాంగ్రెస్ మధ్య పొత్తుపై రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ అంశంపై సిపిఎంలో మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. తృణమూల్ కాంగ్రెస్‌ను ఓడించేందుకు రాష్ట్రంలో వామపక్షాలతో పొత్తు పెట్టుకోవాలని రాష్ట్ర కాంగ్రెస్‌లోని ఒక వర్గం సూచిస్తోంది. బిహార్‌లో మహాకూటమి బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఏ కూటమిని ఓడించిన తరువాత ఈ వాదనకు మరింత బలం చేకూరింది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అధీర్ చౌదరి సహా ఆ పార్టీకి చెందిన పలువురు సీనియర్ నాయకులు సిపిఎంతో పొత్తు పట్ల ఇదివరకే సానుకూలంగా మాట్లాడారు. అయితే దీనిపై సిపిఎం ఇంకా ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ విషయంలో తమ పార్టీ ప్రస్తుతం సందిగ్ధంలో ఉందని సిపిఎం నాయకులు పేర్కొన్నారు. ‘బెంగాల్‌లో తమ పార్టీ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటే దాని ప్రభావం కేరళపై పడుతుంది. కేరళలో తమ పార్టీకి కాంగ్రెస్‌యే ప్రధాన ప్రత్యర్థి. కొద్ది నెలల్లో బెంగాల్‌తో పాటే కేరళ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి’ అని సిపిఎం సీనియర్ నాయకుడు ఒకరు పిటిఐ వార్తాసంస్థకు చెప్పారు. ‘తృణమూల్ కాంగ్రెస్‌ను ఓడించేందుకు కాంగ్రెస్ సహా లౌకిక, ప్రజాతంత్ర శక్తులతో పొత్తు పెట్టుకోవాలని రాష్ట్ర ప్రజలు మమ్మల్ని కోరుతున్నారు. పార్టీ నాయకత్వం ఈ విషయంలో నిర్ణయం తీసుకునేప్పుడు ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకోవాలి’ అని ఆయన అన్నారు. అయితే బెంగాల్‌లో కాంగ్రెస్‌తో తమ పార్టీకి పొత్తు ఉండబోదని కేరళకు చెందిన సిపిఎం నాయకులు అంటున్నారు.
కాంగ్రెస్, బిజెపిలకు దూరంగా ఉండాలని గత పార్టీ మహాసభలో తీసుకున్న రాజకీయ విధానానికి ఇది విరుద్ధం అవుతుందని వారు పేర్కొంటున్నారు. బెంగాల్, కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించే ఎత్తుగడలు పార్టీ రాజకీయ విధానానికి వ్యతిరేకంగా ఉండకూడదని కేరళకు చెందిన సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు ఎం.ఎ.బేబి అన్నారు. ఇటీవలే ఇక్కడ ముగిసిన సిపిఎం ప్లీనంలో పాల్గొనేందుకు ఆయన ఇక్కడికి వచ్చారు. బేబి వాదనతో కేరళకు చెందిన మరికొంత మంది సిపిఎం నాయకులు ఏకీభవించారు. ‘సిపిఎం జాతీయ పార్టీ. ప్రాంతీయ పార్టీ కాదు. మహాసభలో ఆమోదించిన విధానానికి అది కట్టుబడి ఉండాలి. రెండు రాష్ట్రాలకు రెండు వేర్వేరు రాజకీయ వ్యూహాలు ఉండజాలవు. అందువల్ల సిపిఎం కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోదు’ అని కేరళకు చెందిన మరో సీనియర్ నాయకుడు అన్నారు.