జాతీయ వార్తలు

కమలానిదే అరుణాచల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇటానగర్, డిసెంబర్ 31: వేగంగా మారుతున్న అరుణాచల్‌ప్రదేశ్ రాజకీయాల్లో శనివారం మరోసారి అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్‌ప్రదేశ్ (పిపిఎ)కి చెందిన మొత్తం 43 మంది ఎమ్మెల్యేల్లో 33 మంది ఎమ్మెల్యేలు రాష్ట్ర ముఖ్యమంత్రి పెమా ఖండూ నేతృత్వంలో శనివారం బిజెపిలో చేరారు. దీంతో ఆ రాష్ట్రంలో బిజెపి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. పిపిఎ నుంచి తనతో కలసి వచ్చిన ఎమ్మెల్యేలతో పెమా ఖండూ రాష్ట్ర శాసనసభ స్పీకర్ తెన్జింగ్ నోర్బు తొంగ్చోక్ ఎదుట పరేడ్ నిర్వహించారు. దీంతో వారు బిజెపిలో చేరడాన్ని స్పీకర్ ఆమోదించారు. పిపిఎ అధ్యక్షుడు ఖఫా బెంగియా గురువారం రాత్రి పెమా ఖండూతో పాటు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి చౌనా మెయిన్‌ను, మరో ఐదుగురు శాసనసభ్యులను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తాత్కాలికంగా బహిష్కరించడంతో ఈ రాజకీయ డ్రామా మొదలైంది. రాష్ట్రంలోని అధికార ఎన్‌ఇడిఎ (నార్త్‌ఈస్ట్ డెమోక్రటిక్ అలయెన్స్)లో భాగస్వామిగా ఉన్న పిపిఎ ఈ బహిష్కరణల పర్వం అనంతరం తమ ముఖ్యమంత్రిగా తకమ్ పారియోను శుక్రవారం ఎన్నుకుంది. అయితే తొలుత పారియోకు మద్దతు తెలిపిన పిపిఎ శాసనసభ్యుల్లో అనేక మంది ఆ తర్వాత పెమా ఖండూకు విధేయతను ప్రకటించడంతో రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోయాయి. దీంతో పిపిఎ శనివారం కూడా మరో నలుగురు ఎమ్మెల్యేలను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. తాజాగా సస్పెన్షన్‌కు గురైన ఎమ్మెల్యేల్లో హొన్‌చున్ నందమ్, బమాంగ్ ఫెలిక్స్, పంజీ మరా, పానీ తరామ్ ఉన్నారు. వీరితో పాటు పిపిఎకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు శనివారం బిజెపిలో చేరడంతో ఆ రాష్ట్రంలో కమలం వికసించింది.