జాతీయ వార్తలు

అత్యధిక సీట్లు బిజెపికే..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 4:దేశ వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేకెత్తిస్తున్న ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కేంద్రంలోని అధికార బిజెపినే మెజార్టీ సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశం ఉందని తాజాగా జరిగిన ఓ సర్వేలో స్పష్టమైంది. ఏడు దశల్లో ఎన్నికలు జరుగనున్న 403 అసెంబ్లీ స్థానాల్లో బిజెపికి 206-216 సీట్ల మధ్య రావచ్చునని ఇండియాటుడే- ఆక్సిస్ సంస్థ అక్టోబర్- డిసెంబర్ మధ్యకాలంలో సర్వే నిర్వహించింది. డిసెంబర్ చివరి నాటికి బిజెపి ఓట్ల శాతం 31శాతం నుంచి 33శాతానికి పెరిగిందని కూడా వెల్లడించింది. 2012లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పదిహేను శాతం ఓట్లతో 47స్థానాలను గెలుచుకుంది. నోట్ల రద్దు తర్వాత కూడా బిజెపి పట్ల ఓటర్లలో ఎలాంటి వ్యతిరేకత కనిపించక పోవడానికి దాని ఓట్ల శాతం పెరగడమే నిదర్శనమని ఈ సంస్థ పేర్కొంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న సమాజ్‌వాది పార్టీకి 26శాతం మేర ఓట్లు వచ్చే అవకాశం ఉందని, ఇదే 92-97సీట్లతో రెండోస్ధానంలో నిలిచే అవకాశం ఉందని తెలిపింది. అలాగే మాయావతి సారధ్యంలోని బహుజన సమాజ్ పార్టీకి వచ్చే సీట్లు 79-85 మధ్యే ఉంటాయని కూడా సర్వే ఫలితాల్ని బట్టి ఈ అంచనావేసింది. మిగతా పార్టీలన్నింటికంటే ముందుగానే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించి, ముఖ్యమంత్రి అభ్యర్ధిని కూడా ప్రకటించిన కాంగ్రెస్ పార్టీకి కేవలం ఐదు నుంచి తొమ్మిది మధ్యే సీట్లు వచ్చే అవకాశం ఉందని, దీని ఓట్ల శాతం కూడా ఆరుశాతానికి మించక పోవచ్చునని తెలిపింది. రాష్ట్రీయ లోక్‌దళ్, అప్నాదళ్, లెఫ్ట్ పార్టీలకు వచ్చే సీట్లు 7నుంచి 11మధ్యే ఉండవచ్చునని అంచనావేసింది. కాగా, ప్రస్తుత ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవే మళ్లీ ముఖ్యమంత్రి కావాలన్న అభిప్రాయాన్ని 33శాతం మంది వ్యక్తం చేశారు.