జాతీయ వార్తలు

పార్లమెంటు ప్రాంగణంలో ఎంపీలకు ప్రవర్తనా నియమావళి లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 4: పార్లమెంట్ లోపల, ప్రాంగణంలో ఎంపీలకు ఎటువంటి ప్రవర్తనా నియమావళి లేదని లోక్‌సభ ఉప కార్యదర్శి సమాధానం ఇచ్చారు. సమాచార హక్కు చట్టం ద్వారా న్యాయవాది శ్రవణ్‌కుమార్ పార్లమెంట్‌లో ఎంపీలపై దాఖలైన ఫిర్యాదులు, వ్యవహార శైలిపై సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి పార్టీలు మారిన కొత్తపల్లి గీత, ఎస్పీవై రెడ్డి,శ్రీనివాస్ రెడ్డిలపై ఎంపీ రాజమోహన్‌రెడ్డి లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారని ఆయన వెల్లడించారు.ప్రస్తుతం ఈ ఫిర్యాదులు స్పీకర్ పరిశీలనలో ఉన్నాయని వెల్లడించారు. అలాగే ఏపీ విభజన బిల్లు లోక్‌సభలో ప్రవేశపెట్టిన సందర్భంలో 2014 ఫిబ్రవరి 13న సభలో పెప్పర్ స్ప్రే ఘటనపై దాఖలైన ఫిర్యాదులు, తీసుకున్న చర్యలకు సమాధానం ఇవ్వాలని కోరగా..... ఈ ఘటనపై లోక్‌సభ ప్రివిలేజ్ కమిటీకి సిఫార్సు చేశారని, 2014మేలో పదిహేనవ లోక్‌సభ గడువు ముగియడంతో చర్యలు తీసుకోలేదని తెలిపారు. అలాగే సభ్యుల ఫిర్యాదులపై పరిష్కరించడానికి నిర్ణీత కాలపరిమితి ఉందా? అని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ ..అటువంటిది ఏమీ లేదని స్పష్టం చేశారు. పార్లమెంట్ ఎంపీలకు ప్రవర్తనా నియమావళి వివరాలివ్వాలని కోరగా.. పార్లమెంట్ లోపల, పార్లమెంట్ ప్రాంగణంలో ఎంపీలకు ఎటువంటి ప్రవర్తనా నియమావళి లేదని సమాధానం తెలియజేశారు. అయితే ఇటీవల టిఆర్‌ఎస్ పార్టీలోకి చేరిన కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, టిడిపి ఎంపీ మల్లారెడ్డిపై ఫిర్యాదులు చేయకపోవడం గమనార్హం.