జాతీయ వార్తలు

భారత 44వ సిజెగా కెహర్ ప్రమాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 4:నాయయమూర్తుల నియామకానికి సంబంధించిన వివాదాస్పద ఎన్‌జెఎసి చట్టాన్ని రద్దు చేసిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి సారధ్యం వహించిన జస్టీస్ కెహర్ బుధవారం సుప్రీం కోర్టు 44వ ప్రధాన న్యాయమూర్తిగా బుధవారం పదవీ స్వీకార ప్రమాణం చేశారు. రాష్టప్రతి భవన్‌లోని దర్బార్ హాలులో ఆయన చేత రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ ప్రమాణం చేయించారు.
సిక్కు కమ్యూనిటీకి చెందిన వ్యక్తి భారత ప్రధాన న్యాయమూర్తిగా పదవి చేపట్టడం ఇదే మొదటి సారి. 64సంవత్సరాల కేహర్ అత్యంత సీనియర్ న్యాయమూర్తి కావడంతో తన వారసుడిగా ఆయన పేరునే పదవీ విరమణ చేసిన టిఎస్ ఠాకూర్ గత నెల్లో సిఫార్సు చేశారు. ఆగస్టు 27వరకూ అంటే ఏడు నెలలకు పైగా కేహర్ ఈ పదవిలో కొనసాగుతారు. అరుణాచల్‌లో రాష్టప్రతి పాలన విధింపు కొట్టివేత, సహారా అధినేత సుబ్రతారాయ్‌కి జైలు శిక్ష విధించిన సుప్రీం ధర్మాసనాలకు కేహర్ సారధ్యం వహించారు. ముఖ్యంగా సమానమైన పనికి సమానమైన వేతనం అన్న నిబంధన రోజువారీ కార్మికులు, కాంట్రాక్టు ఉద్యోగులకు వర్తిసుందన్న కీలక తీర్పును కూడా ఆయన సారధ్యంలోని ధర్మాసనమే వెలువరించింది.