జాతీయ వార్తలు

బేసి... భేష్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 1: దేశంలోనే మొదటిసారిగా వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి ఢిల్లీ ప్రభుత్వం రూపొందించిన బేసి-సరి సంఖ్యల వాహనాల పథకం కొత్త సంవత్సరం ఆరంభ దినమైన శుక్రవారం ప్రారంభమయింది. ఈ పథకం అమలు వల్ల రోడ్ల మీదకి వచ్చే వాహనాల సంఖ్య గణనీయంగా తగ్గింది. అందుకు తగ్గట్టుగా ప్రజా రవాణా వ్యవస్థ పెరిగింది. బేసి-సరి సంఖ్యల వాహనాల పథకాన్ని అమలు చేయడానికి వేలాది మంది పోలీసులు మోహరించారు. శుక్రవారం ఉదయం ఎనిమిది గంటలకు ఈ బేసి-సరి సంఖ్యల పథకం అమలులోకి వచ్చింది. ఈ పథకం అమలులో పోలీసులకు సహకరించడానికి వేలాది మంది కార్యకర్తలు గులాబీ పూలు చేతపట్టుకొని వీధుల్లోకి వచ్చారు. పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన ఈ పథకం ఈ నెల 15వరకు అమలులో ఉంటుంది. ప్రయోగాత్మకంగా చేపట్టిన ‘కార్ రేషనింగ్’కు ప్రజలనుంచి అమితమైన స్పందన వచ్చిందని, ఆప్ ప్రభుత్వం ప్రయోగాత్మకంగా అమలు చేసిన ఈ పథకం ప్రజల స్పందనతో ఒక ఉద్యమంగా రూపుదిద్దుకుందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. నంబర్ ప్లేట్లపై రిజిస్ట్రేషన్ నంబర్ బేసి సంఖ్య గల కార్లు మాత్రమే జనవరి ఒకటో తేదీన రోడ్లపైకి రావాల్సి ఉంటుంది. ఒకవేళ సరి సంఖ్య గల కార్లు రోడ్లపైకి వస్తే ఒక్కో కారుకు మోటారు వాహనాల చట్టంలోని వివిధ సెక్షన్ల కింద రూ. 2వేల జరిమానా విధిస్తారు. రెండో తేదీ ఇందుకు విరుద్ధంగా ఉంటుంది. కేవలం సరి సంఖ్య గల కార్లు మాత్రమే రోడ్లపైకి రావాల్సి ఉంటుంది. 200 ట్రాఫిక్ పోలీసు బృందాలు, 66 రవాణా శాఖ బృందాలు, 40 సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్స్ బృందాలు రంగంలోకి దిగి ఈ పథకాన్ని గట్టిగా అమలు చేశాయి. ప్రతి రోజు రాత్రి ఎనిమిది గంటల వరకు ఈ పథకం అమలులో ఉంటుంది. ఈ పథకాన్ని అమలు చేసినప్పటికీ ఢిల్లీ సచివాలయం వంటి కొన్ని ప్రాంతాల్లో వాయు కాలుష్యం ఇంకా కొనసాగింది. ఈ పథకం వల్ల ప్రజా రవాణా వైపు మళ్లిన ప్రజల రద్దీని తట్టుకునేందుకు అదనంగా 3వేల బస్సులను రంగంలోకి దింపారు. మెట్రో కూడా అదనంగా 70 ట్రిప్పులు నడపాలని నిర్ణయించింది. తమకు అందిన ప్రాథమిక సమాచారాన్ని బట్టి ఈ పథకం దిగ్విజయంగా అమలు అయిందని, కార్లపై ఆంక్షలను ఢిల్లీ ప్రజలు సహృదయంతో స్వాగతించారని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తన నివాసం వెలుపల విలేఖరులతో మాట్లాడుతూ అన్నారు. బలవంతంగా కాకుండా ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తేనే పథకం విజయవంతం అవుతుందని తాను చాలాసార్లు చెప్పానని ఆయన గుర్తుచేశారు.