జాతీయ వార్తలు

రేపు ఆర్‌ఎస్‌ఎస్ బలప్రదర్శన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జనవరి 1: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) పుణె సమీపంలో ఆదివారం భారీ మహాసభను నిర్వహించడానికి రంగం సిద్ధమైంది. దశాబ్ద కాలంలో ఆర్‌ఎస్‌ఎస్ ఇంత పెద్ద మహాసభను నిర్వహించడం ఇదే మొదటిసారని భావిస్తున్నారు. పుణె నగర శివార్లలోని హింజేవాడి ఐటి పార్కు సమీపంలో దాదాపు 450 ఎకరాల స్థలంలో నిర్వహించే ఈ మహాసభకు దాదాపు లక్షన్నర మంది హాజరవుతారని భావిస్తున్నారు. ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రసంగించే ఈ మహాసభకు హాజరవడం కోసం పశ్చిమ మహారాష్ట్ర జిల్లాలయిన పుణె, నాసిక్, అహ్మద్‌నగర్, సతారా, సాంగ్లి,సోలాపూర్, కొల్హాపూర్ జిల్లాలకు చెందిన ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు ఇప్పటికే రిజిస్టర్ చేసుకున్నారు. ఇటీవలి సంవత్సరాల్లో ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు ఇంత భారీ సంఖ్యలో పాల్గొంటున్న మహాసభ ఇదే అవుతుందని ఈ ఈవెంట్ సమన్వయకర్త సారంగ్ వాబ్లే చెప్పారు.
దేశంలోని సభ్య సమాజాలు, సంఘసేవా సంస్థలకు మరింతగా చేరువ కావడం ఈ మహాసభ ముఖ్య ఉద్దేశమని ఆయన చెప్పారు. ‘సంఘ్‌ను ఓ సానుకూల శక్తిగా చూపించడంతో పాటుగా మరింత మందికి చేరువ కావడం ఈ సభ ప్రధాన ఉద్దేశం. సంఘ్‌పరివార్ పాటిస్తున్న క్రమశిక్షణ సిద్ధాంతాలను హైలైట్ చేయాలనేది మా ప్రధాన ఉద్దేశం. సమాజంలోని ముఖ్యమైన వ్యక్తులకు సంఘ్ పరివార్ మూల సిద్ధాంతాలను చూపించాల్సిన అవసరం ఉంది’ అని ఆయన అన్నారు. కాగా, ఈ సమావేశం పూర్తిగా పర్యావరణ హితమైనదిగా ఉంటుందని పుణె ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ బాపుఘట్పండే చెప్పారు.
సమావేశం ప్రాంగణంలో భారీ లౌడ్‌స్పీకర్లను ఏర్పాటు చేయబోవడం లేదని, అయితే మెగాఫోన్లు ఉపయోగించి ప్రసంగాలు అందరికీ చేరేట్లుగా చూస్తామని ఆయన చెప్పారు. ప్రతి మాట కూడా చిట్ట చివరి వ్యక్తికి కూడా స్పష్టంగా వినిపించేలా చూస్తామని అయన చెప్పారు. ఆహారాన్ని కూడా పోక ఆకులతో చేసిన ప్లేట్లలో సర్వ్ చేస్తారు. ప్రముఖ రూపశిల్పి నితిన్ దేశాయి తొమ్మిది అంతస్తుల రాయగడ కోట ప్రతి రూపాన్ని తయారు చేసారు. ఇక్కడినుంచే మోహన్ భగవత్ జనాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆర్‌ఎస్‌ఎస్ సర్‌కార్యవాహ్ సురేశ్ జోషీ కూడా ఈ మహాసభలో పాల్గొంటారు. ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన ఇద్దరు అగ్రనాయకులు కలిసి ఇలా ఒకే కార్యక్రమంలో పాల్గొనడం చాలా అరుదుగా జరుగుతుంది.

బిజెపి ఎంపి
కారు నిలిపివేత!
న్యూఢిల్లీ, జనవరి 1: బిజెపి ఎంపి, మాజీ ముంబయి పోలీసు కమిషనర్ సత్యపాల్ సింగ్ ప్రయాణిస్తున్న సరి సంఖ్య గల కారును ఇండియా గేట్ వద్ద నిలిపివేసినట్లు సమాచారం. అయితే తన కారు సరి సంఖ్య గలది అయినప్పటికీ దాన్ని ఎవరూ ఆపలేదని సింగ్ చెప్పారు. ఈ పథకం నుంచి తనకు మినహాయింపు ఉన్నందు వల్ల ఆపలేదని ఆయన తెలిపారు. తాను హాజరు కావాల్సి ఉన్న ఒక కార్యక్రమం వేదిక ఎక్కడో తెలుసుకోవడానికి తానే ఒక కానిస్టేబుల్‌ను పిలిచానని ఆయన చెప్పారు. అయితే తాను చట్టానికి కట్టుబడి ఉండే వ్యక్తినని, గతంలో పోలీస్ కమిషనర్‌గా పనిచేశానని, అందువల్ల చట్టాన్ని ఉల్లంఘించే సమస్యే లేదని ఆయన వివరించారు. అంతకు ముందు అందిన సమాచారం ప్రకారం సింగ్‌కు ఎలాంటి జరిమానా విధించలేదు. కార్ రేషనింగ్ వివరాలతో కూడిన ఒక కరపత్రాన్ని ఆయనకు అందజేశారు.