జాతీయ వార్తలు

31నుంచే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 7: పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ముందు అనుకున్నట్లుగా జనవరి 31వ తేదీనే ప్రారంభం కానున్నాయి. ఆ మర్నాడు (్ఫబ్రవరి 1న) కేంద్ర బడ్జెట్‌ను సమర్పిస్తారు. జనవరి 31న రాజ్యసభ, లోక్‌సభ సమావేశాలను ఏర్పాటు చేయాలని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ ఆదేశించినట్లు ఒక అధికారిక ప్రకటన తెలిపింది. 31న పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి రాష్టప్రతి ప్రసంగంతో పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానుండగా, అదే రోజు ప్రీ బడ్జెట్ ఆర్థిక సర్వేను సభకు సమర్పిస్తారు. కాగా, ఇప్పుడున్న ప్రభుత్వ కార్యకలాపాల మేరకు ఈ సమావేశాలు ఏప్రిల్ 12వ తేదీతో ముగుస్తాయని లోక్‌సభ సెక్రటేరియట్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఏడాదినుంచి రైల్వేకు ప్రత్యేక బడ్జెట్‌ను సమర్పించే సంప్రదాయానికి స్వస్తి చెప్తున్న విషయం తెలిసిందే. అయిదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిన దృష్ట్యా ఎన్నికలకు ముందు కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం వల్ల అది ఫలితాన్ని ప్రభుత్వానికి అనుకూలంగా మొగ్గేలా చేస్తుందని అంటూ ప్రతిపక్షాలు ఫిబ్రవరి 1న బడ్జెట్‌ను సమర్పించడంపై అభ్యంతరాలు వ్యక్తం చేయడం తెలిసిందే. దీనిపై ఆ పార్టీలు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయడం, ఇసి దీనిపై ప్రభుత్వం స్పందనను తెలియజేయాలని క్యాబినెట్ కార్యదర్శి ఎస్‌కె సిన్హాను కోరింది కూడా.
బడ్జెట్ వెనక్కి జరుపుతారా?
10లోగా ప్రభుత్వ సమాధానాన్ని కోరిన ఇసి
న్యూఢిల్లీ, జనవరి 7: అయిదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగడానికి ముందు కేంద్రం బడ్జెట్‌ను సమర్పించాలనుకోవడంపై ప్రతిపక్షాలు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో తన అభిప్రాయాన్ని తెలియజేయాలని ఎన్నికల కమిషన్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఎన్నికల ప్రధానాధికారి నసీమ్ జైదీ కేంద్ర క్యాబినెట్ సెక్రటరీ పి.కె సిన్హాకు శుక్రవారం ఈ మేరకు ఒక లేఖ రాశారు. బడ్జెట్ సమర్పణను ఫిబ్రవరి 1వ తేదీకి ముందుకు జరపాలన్న కేంద్ర ప్రభుత్వ ఆలోచనపై సిన్హా తన అభిప్రాయాన్ని ఇసికి సమర్పించడానికి ముందు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను సంప్రదించవచ్చని తెలుస్తోంది. బడ్జెట్ సమర్పణను కనీసం అయిదు రాష్ట్రాల్లో ఓటింగ్ ప్రక్రియ పూర్తయ్యే మార్చి 8 వరకైనా వాయిదా వేయాలని కోరుతూ కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, బిఎస్‌పి, సమాజ్‌వాది పార్టీతోపాటుగా పలు ప్రతిపక్షాలు తనకు రాసిన లేఖను ఎన్నికల కమిషన్ కేబినెట్ సెక్రటరీకి పంపించింది. ఈ లేఖపై 10వ తేదీలోగా స్పందించాలని ఇసి సిన్హాను కోరింది. అయితే ముందు అనుకున్న ప్రకారం ఫిబ్రవరి 1నే బడ్జెట్‌ను సమర్పించాలనే దృఢ అభిప్రాయంతో ప్రభుత్వం ఉందని, నిబంధనల ప్రకారం కూడా ఫిబ్రవరి 3 వారంలో ప్రారంభమయ్యే పార్లమెంటు బడ్జెట్ సమావేశాలను ముందుకు జరపడంలో ఎలాంటి తప్పూ లేదని ప్రభుత్వం వర్గాలు చెప్తున్నాయ. బడ్జెట్ సమావేశాలు జనవరి 31న ప్రారంభమవ్వాలని, ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌ను సమర్పించాలని పార్లమెంటరీ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ సిఫార్సు చేసిన విషయం తెలిసిందే.