జాతీయ వార్తలు

నోట్ల రద్దు ఓ పవిత్ర ఉద్యమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 7: నోట్ల రద్దును పవిత్ర ఉద్యమంగా అభివర్ణించిన బిజెపి, నోట్ల రద్దు తర్వాత ఎదురయిన ఇబ్బందులను ప్రజలు చిరునవ్వుతో స్వీకరించారని పేర్కొంది. నల్లధనం అంతా ఇప్పుడు బ్యాంకుల్లో జమ అవుతోందని, ఫలితంగా ప్రభుత్వ రాబడి పెరిగి, జిడిపి వృద్ధి మరింత జోరందుకుంటుందని స్పష్టం చేసింది. రెండు రోజులుగా ఇక్కడ జరుగుతున్న బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాల చివరి రోజయిన శనివారం ఈ మేరకు ఒక రాజకీయ తీర్మానాన్ని ఆమోదించారు. నోట్ల రద్దు తర్వాత దేశంలో నెలకొన్న సానుకూల వాతావరణాన్ని నాశనం చేయడం ద్వారా ప్రభుత్వాన్ని అప్రతిష్ఠ పాలు చేయడానికి ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని విమర్శించిన తీర్మానం, నోట్ల రద్దును పేదల సంక్షేమంకోసం చేపట్టిన సాహసోపేత నిర్ణయంగా పేర్కొంది. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ పవిత్ర ఉద్యమంలో ప్రజలు ఎంతో ఉత్సాహంగా, నూతన శక్తితో బ్యాంకుల ముందు గంటల కొద్దీ క్యూలలో నిలబడ్డం ద్వారా కష్టాలను చిరునవ్వుతో సహించారని తీర్మానంలో పేర్కొన్నారు.
ఆర్థిక తీర్మానాన్ని ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడుతూ, నోట్ల రద్దు నిర్ణయంతో నల్లధనం అంతా ఇప్పుడు బ్యాంకుల్లో జమ అయిందని, అదనంగా వచ్చి చేరిన సొమ్ము అభివృద్ధి పథకాలకు ఊపునిస్తుందని అన్నారు. ఉగ్రవాద నిధులకు, నల్లధనం నిరోధానికి నవం తీసుకున్న నోట్ల రద్దు సాహసోపేతమైన, చరిత్రాత్మకమైన నిర్ణయంగా ఆయన అభివర్ణించారు. సమీప భవిష్యత్తులో వస్తు సేవల పన్ను (జిఎస్‌టి) సాఫీగా అమలు కావడానికి నోట్ల రద్దు అవసరమని తీర్మానం అభిప్రాయ పడింది. ‘ఇప్పుడు బ్యాంకుల వద్ద అప్పులు ఇవ్వడానికి ఎక్కువ డబ్బు ఉంది, వడ్డీ రేట్లు సైతం తగ్గుతున్నాయి’ అని పేర్కొంది. నోట్ల రద్దుతో రాష్ట్రాల రాబడులు తగ్గాయన్న వాదనలో ఎంతమాత్రం నిజం లేదని జైట్లీ అంటూ, నిజానికి ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లాంటి కొన్ని రాష్ట్రాల్లో రెవిన్యూ పెరిగిందని అన్నారు. పశ్చిమ బెంగాల్‌లో మాత్రమే రెవిన్యూ తగ్గిందని, సమర్థవంతమైన ప్రభుత్వాలను నడపడం ద్వారా రాష్ట్రాలు తమ రెవిన్యూ పెంచుకోవచ్చన్నారు. నల్లధనాన్ని వెనక్కి తీసుకురావడానికి ప్రభుత్వం గత రెండేళ్లుగా తీసుకున్న చర్యలను జైట్లీ ఆ తీర్మానంలో వివరించారు. డిజిటల్ ఆర్థిక వ్యవస్థ వల్ల ప్రజలు కట్టిన పన్నులు పక్కదారి పట్టడాన్ని ఆపవచ్చని, పనికి ఆహార పథకం లాంటి సంక్షేమ పథకాల్లో దళారీల పాత్ర లేకుండా ప్రభుత్వం సమర్థవంతంగా చర్యలు తీసుకుందని కూడా తీర్మానం అభిప్రాయపడింది.

చిత్రం... శనివారం జరిగిన బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశంలో వేదికపై సీనియర్ నేత
ఎల్‌కె అద్వానీ, అధ్యక్షుడు అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ