జాతీయ వార్తలు

ఆదాయం అంత.. పన్ను ఇంతేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: పెద్దనోట్ల రద్దుతో దేశంలో ఆర్థిక వ్యవస్థలో చోటుచేసుకున్న సమతూక రాహి త్యం బయటపడిందని ఆర్థిక మంత్రి జైట్లీ అన్నారు. ప్రజలు కట్టే పన్నుకు, వారి జీవనశైలి వినియోగానికి ఏ మాత్రం పొంతన లేదని తన బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. ప్రత్యక్ష పన్నుల వసూళ్లు ఎంతమాత్రం వాస్తవికతకు అద్దం పట్టడం లేదన్నారు. 130 కోట్లు దాటిన దేశ జనాభాలో 5 లక్షలపైన వార్షికాదాయం కలిగిన వ్యక్తులు 76 లక్షలు మాత్రమేనని స్పష్టం చేశారు. 2015-16లో 3కోట్ల 70 లక్షల మంది ఆదాయం పన్ను రిటర్న్స్ దాఖలు చేశారని వీరిలో 99 లక్షల మంది తమ వార్షికాదాయం రెండున్నర లక్షల మినహాయింపుపరిధిలోపే ఉన్నట్టు చూపారని తెలిపారు. కోటీ 95 లక్షల మంది తమ ఆదాయం రెండున్నర లక్షలు- ఐదు లక్షలు మించి మధ్య ఉన్నట్టు రిటర్న్స్ దాఖలు చేశారని అన్నారు. 52 లక్షల మంది మాత్రమే తమ ఆదాయం 5 నుంచి 10 లక్ష మధ్య ఉన్నట్టు చూపారని జైట్లీ అన్నారు. కేవలం 24 లక్షల మంది మాత్రమే తమ ఆదాయం 10 లక్షలపైనేనని వెల్లడించారని తెలిపారు. ఈ 76 లక్షల మందిలో 5 లక్షలపైన వార్షికాదాయం ఉన్నట్టు ప్రకటించిన వారిలో 56 లక్షల మంది ఉద్యోగులేనని ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు. 50 లక్షలకుపైగా వార్షిక ఆదాయం ఉన్నట్టుగా ప్రకటిస్తున్న వ్యక్తుల సంఖ్య కేవలం 1.72 లక్షల మంది మాత్రమేనని ఆయన పేర్కొన్నారు. దీన్ని బట్టి చూస్తే ప్రజల ఆదాయ, వినియోగ స్థాయికి వారు చెల్లిస్తున్న పన్నుకు ఏ మాత్రం పొంతన కనిపించడం లేదన్నారు. గత ఐదేళ్లలో దేశంలో 1.25 కోట్లమేర కార్లు అమ్ముడుపోయాయని తెలిపారు. 2015లో వ్యాపారం, టూరిజం ఇతర అవసరాలపై విమానాల్లో విదేశాలకు వెళ్లిన వారి సంఖ్య 2 కోట్ల మందిపైనేనని మంత్రి వివరించారు. వ్యవస్థీకృత రంగంలో 4.2 కోట్ల మంది పనిచేస్తున్నారని వారిలో కేవలం 1.74 కోట్ల మంది మాత్రమే రిటర్న్స్ దాఖలు చేస్తున్నారని అన్నారు. అలాగే అనియత రంగంలో ఉన్నవారి సంఖ్య 5.6 కోట్లయితే 1.81 మంది మాత్రమే ఐటి రిటర్న్స్ దాఖలు చేస్తున్నారని జైట్లీ పేర్కొన్నారు. 2014 మార్చివరకూ 13.94 లక్షల కంపెనీలు రిజిస్టర్ అయ్యాయని వీటిలో 5.97 కంపెనీలు 2016-17 సంవత్సరానికి గాను రిటర్న్స్ దాఖలు చేశాయన్నారు. వీటిలో 2.76లక్షల కంపెనీలు నష్టాల్లో ఉన్నట్టుగా లేదా అసలు ఆదాయమే లేనట్టుగా రిటర్న్స్ దాఖలు చేశాయన్నారు. 2.85 లక్షల కంపెనీలు పన్ను చెల్లించడానికి ముందు ఆదాయం కోటి రూపాయలకంటే తక్కువేనని చూపించాయని చెప్పారు. 28వేల కంపెనీలు కోటి నుంచి 10 కోట్ల మధ్య లాభం గడించినట్టు చూపించాయని జైట్లీ స్పష్టం చేశారు. పెద్దనోట్ల రద్దు తరువాత జరిగిన డిపాజిట్లను బట్టి చూస్తే వాస్తవ పరిస్థితి ఏమిటో స్పష్టమైందని తెలిపారు. నవంబర్ 8 నుంచి డిసెంబర్ 30 మథ్యకాలంలో కోటి తొమ్మిదివేల ఖాతాల్లో 2 లక్షల నుంచి 80 లక్షల వరకూ డిపాజిట్లు జరిగాయని, సగటు డిపాజిట్ పరిమాణం 5 లక్షల పైచికేనని మంత్రి వివరించారు. 1. 48 లక్షల ఖాతాల్లో 80 లక్షలకు పైగా డిపాజిట్టు వచ్చాయని సగటు డిపాజిట్ల పరిణామం 3.31 కోట్లని మంత్రి తెలిపారు.
ఈ వివరాలు అన్నీ కూడా ఐటి పరిధిని విస్తరించడానికి, రెవిన్యూను పెంచుకోడానికి దోహదం చేస్తాయని జైట్లీ స్పష్టం చేశారు.