జాతీయ వార్తలు

వారానికి రూ. 50 వేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 8: పెద్ద నోట్ల రద్దుతో నగదు ఉపసంహరణపై విధించిన ఆంక్షల నుంచి త్వరలో విముక్తి లభించనుంది. మార్చి 13నుంచి సేవింగ్స్ ఖాతాల నుంచి నగదు ఉపసంహరణకు సంబంధించి అన్ని పరిమితులను ఎత్తివేయనున్నట్లు భారత రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది. అయితే ఫిబ్రవరి 20నుంచి సేవింగ్స్ ఖాతాల నుంచి వారానికి రూ.50 వేలు తీసుకునే వెసులుబాటునూ కల్పించింది. ఇప్పటివరకూ వారానికి నగదు ఉపసంహరణ పరిమితి కేవలం రూ.24 వేలు ఉన్న సంగతి తెలిసిందే. ‘రెండు దశల్లో నగదు ఉపసంహరణపై ఉన్న పరిమితులను ఎత్తివేయాలని ఆర్బీఐ నిర్ణయించింది. ఫిబ్రవరి 20 నుంచి సేవింగ్స్ ఖాతాల నుంచి నగదు ఉపసంహరణ పరిమితిని వారానికి రూ. 24వేల నుంచి రూ.50వేలకు పెంచుతున్నాం. మార్చి 13నుంచి పొదుపు ఖాతాల నుంచి ఎలాంటి పరిమితులు లేకుండా నగదు ఉపసంహరించుకోవచ్చు’ అని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఆర్ గాంధీ వెల్లడించారు. కరెంటు ఖాతాల ఉపసంహరణ పరిమితిని ఫిబ్రవరి ఒకటి నుంచి ఉపసంహరించిన సంగతి తెలిసిందే. పొదుపుఖాతాల పరిమితి మాత్రం ఇప్పటికీ కొనసాగుతోంది. రీమానిటైజేషన్‌లో భాగంగా ఫిబ్రవరి 20 తరువాత పాక్షికంగా, మార్చి 13 తరువాత పూర్తిగా పరిమితులను ఎత్తివేస్తారు. పరిమితులు ఎత్తివేసిన తరువాత ఇబ్బందులు తలెత్తకుండా రూ.500, రూ.2000 నోట్లను అవసరమైనంత మేరకు ముద్రిస్తున్నట్టు వివరించారు. ఈ రెండు పెద్ద నోట్లకు సంబంధించి దొంగనోట్లు వస్తున్నట్టు వచ్చిన వార్తలపై గాంధీ స్పందిస్తూ, ఇటీవల వచ్చిన నోట్లన్నీ జిరాక్స్ కాపీలని, వీటిని సామాన్యుడు తేలిగ్గా గుర్తుపట్టవచ్చన్నారు. కొత్తగా చెలామణిలోకి తీసుకువచ్చిన నోట్లలో సెక్యూరిటీ ఫీచర్లు చాలా ఉన్నందున వాటికి డూప్లికేట్ తయారు చేయటం అంత సులభం కాదని స్పష్టం చేశారు.