జాతీయ వార్తలు

భారతీయులంతా హిందువులే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెటుల్ (మధ్యప్రదేశ్), ఫిబ్రవరి 8: హిందుస్థాన్‌లో నివసించే, హిందూమత సంప్రదాయాలను గౌరవించే వారంతా కూడా హిందువులేనని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ స్పష్టం చేశారు. ముస్లింలు ప్రార్థనలు చేసే తీరు వేరుగా ఉన్నప్పటికీ జాతీయత దృష్ట్యా వారు హిందువులేనని కూడా ఆయన అన్నారు. ‘హిందుస్థాన్‌లో నివసించే, హిందూ సంప్రదాయాలను గౌరవించే వారంతా కూడా హిందువులే. ముస్లింలు ప్రార్థనలు చేసే విధా నం వేరయినప్పటికీ జాతీయత దృష్ట్యా వారూ హిందువులే, హిందువులంతా కూడా హిందుస్థాన్‌కు జవాబుదారీగా ఉండాలి’ అని బుధవారం ఇక్కడ హిందూ సమ్మేళనంలో మాట్లాడుతూ భగవత్ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా భారతీయ సమాజం హిందువులుగానే తెలుసునని, భారతీయులంతా హిందువులేనని, మనమంతా ఒకే సమాజమని ఆయన చెప్పారు. అందువల్ల మనం దేశానికి జవాబుదారీగా ఉండాలి. అందువల్ల హిందువులు తమ విభేదాలను మరిచి ఒకటిగా ఉండడం అవసరమని భాగవత్ అన్నారు. అంతకు ముందు ఆయన బెటుల్ జిల్లా జైలును సందర్శించి ఆర్‌ఎస్‌ఎస్ రెండవ సర్‌సంఘ్‌చాలక్ దివంగత మాధవ్ సదాశివ్ గోల్వాల్కర్ అలియాస్ గురూజీకి నివాళులర్పించారు. 1948లో మహాత్మాగాంధీ హత్య అనంతరం ఆర్‌ఎస్‌ఎస్‌ను నిషేధించినప్పుడు గోల్వాల్కర్‌ను మూడు నెలల పాటు నిర్బంధించిన జైలులోని ఒకటో నంబరు బ్యారక్‌ను భగవత్ సందర్శించారు.

ఆర్‌ఎస్‌ఎస్ సహ సర్‌కార్యవాహక్ సురేశ్ సోనీ, స్థానిక ఎమ్మెల్యే హేమంత్ ఖండేల్వాల్ భగవత్ వెంట ఉన్నారు.