జాతీయ వార్తలు

త్వరలో కేంద్ర సిబ్బందికి మరో 2 శాతం కరవుభత్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 5: కేంద్ర ప్రభుత్వం ఈ నెల చివర్లో దాదాపు 50 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, అలాగే 58 లక్షల పింఛనుదారులకు 2 శాతం కరవుభత్యం పెంపును ప్రకటించే అవకాశం ఉంది. ఉద్యోగులు, పింఛనుదారుల ఆదాయాలపై ద్రవ్యోల్బణం ప్రభావాన్ని తగ్గించడం కోసం ప్రభుత్వం కరవుభత్యాన్ని ఇస్తుంది. అయితే ప్రభుత్వం ఇచ్చే కరవు భత్యం వాస్తవంగా ధరల పెరుగుదల ప్రభావాన్ని తగ్గించే విధంగా ఉండడం లేదని ఉద్యోగులు అంటున్నారు.
కేంద్రం అనుసరించే ఫార్ములా ప్రకారం పెరగబోయే కరవుభత్యం 2 శాతం ఉండవచ్చని, 2017 జనవరి 1నుంచి ఇది అమలులోకి వస్తుందని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘాల సమాఖ్య అధ్యక్షుడు కెకెఎన్ కుట్టి పిటిఐకి చెప్పారు. అయితే కరవు భత్యం పెంచడానికి కొలమానంగా తీసుకునే పారిశ్రామిక కార్మికులకోసం వినియోగదారుల ధరల సూచీ (సిపిఐ-ఐడబ్ల్యు) వాస్తవానికి చాలా దూరంగా ఉంటోందని, అందువల్ల ఈ పెంపు నామమాత్రమేనని ఆయన అన్నారు. రిటైల్ ద్రవ్యోల్బణం 12 నెలల సగటును ఆధారంగా తీసుకుని ప్రభుత్వం కరవు భత్యాన్ని పెంచుతుంది.
2017 జనవరి 1నుంచి డిసెంబర్ 31 మధ్య కాలంలో రిటైల్ ద్రవ్యోల్బణం సగటు పెరుగుదల 4.95 శాతంగా ఉంది. అయితే గత ఏడాది అక్టోబర్‌లో కేంద్ర ప్రభుత్వం 2016 జూలై 1నుంచి 2 శాతం కరవుభత్యాన్ని పెంచినందున ఇప్పుడు మరో 2 శాతం పెంచనుంది. వాస్తవానికి పెరుగుదల 2.95 శాతంగా ఉండాల్సి ఉన్నప్పటికీ ప్రభుత్వం 2 శాతంగానే లెక్కల్లోకి తీసుకుని ఆ మేరకు కరవుభత్యాన్ని పెంచనుంది. కాగా, డిఏను నిర్ణయించేటప్పుడు పాయింట్‌కన్నా తక్కువ ఉండే దాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని తమ సమాఖ్య త్వరలో జరగబోయే జాతీయ కౌన్సిల్ సమావేశంలో డిమాండ్ చేస్తుందని కుట్టి చెప్పారు.