జాతీయ వార్తలు

నీటి, విద్యుత్ బిల్లు బకాయిలున్నా.. ఎన్నికల్లో పోటీకి అనర్హులే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 5: నీటి బిల్లులు, విద్యుత్ బిల్లుల బకాయిలు చెల్లించని అభ్యర్థులను ఎన్నికల్లో పోటీకి అనర్హులుగా ప్రకటించడానికి వీలుగా చట్టాల్లో మార్పులు చేయాలని ఎన్నికల కమిషన్ కోరుతోంది. అలాంటి వారిని లోక్‌సభ, శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులుగా ప్రకటించేందుకు 1951 నాటి ప్రజా ప్రాతినిధ్య చట్టంలో సవరణ చేయాలని ఎన్నికల కమిషన్ న్యాయమంత్రిత్వ శాఖను కోరింది. ఎన్నికల నేరాలకు సంబంధించిన చట్టంలోని మూడో అధ్యాయంలో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని ఇసి అభిప్రాయపడుతోంది. ‘ప్రభుత్వ బకాయిలు చెల్లించని కారణంగా’ అనర్హులుగా ప్రకటించడానికి వీలుగా చట్టంలో కొత్త క్లాజును చేర్చాల్సిన అవసరం ఉందని ఇసి ఆ లేఖలో తెలిపింది. కాగా, ఈ అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉంది. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ నివాసాలకు కల్పించిన విద్యుత్, నీటి, టెలిఫోన్ కనెక్షన్లకు సంబంధించి ఎలాంటి బకాయిలు లేవంటూ సంబంధించిన ఏజన్సీనుంచి సర్ట్ఫికెట్‌ను సమర్పించేలా చూడాలని 2015 ఆగస్టులో ఇచ్చిన ఒక ఉత్తర్వులో ఢిల్లీ హైకోర్టు ఎన్నికల కమిషన్‌ను కోరింది. కాగా, సంబంధిత సేవలు అందించే ఏజన్సీలనుంచి ‘నో డిమాండ్ సర్ట్ఫికెట్’తోపాటుగా ఒక నిర్దేశిత ఫార్మాట్‌లో ఒక అదనపు అఫిడవిట్‌ను కూడా అభ్యర్థులు దాఖలు చేయాలని 2016 జనవరినుంచి ఇసి పట్టుబడుతోంది. అంతేకాకుండా ఒకవేళ అభ్యర్థి ఎన్నికలకు ముందు పది సంవత్సరాలపాటు ప్రభుత్వ భవనంలో ఉన్నట్లయితే అద్దె బకాయి లేదని పేర్కొనే సర్ట్ఫికెట్‌ను కూడా సమర్పించాల్సి ఉంటుంది. అయితే ఇలాంటి సర్ట్ఫికెట్లు పొందడానికి ముడుపులు చెల్లించడం వల్ల అవినీతికి దారి తీస్తుందని 2016 మార్చిలో ఎన్నికల సంస్కరణలపై చర్చించడానికి సమావేశమైనప్పుడు ఇసికి రాజకీయ పార్టీలు చెప్పాయి కూడా.