జాతీయ వార్తలు

ముగిసిన అసెంబ్లీ ఎన్నికల పోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, మార్చి 8: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా బుధవారం 40 అసెంబ్లీ స్థానాలకు జరిగిన చివరి విడత పోలింగ్‌లో 60 శాతానికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో రాష్ట్రంలో రెండు నెలలకు పైగా సాగిన ఎన్నికల ప్రక్రియకు తెరపడినట్లయింది. మరోవైపు మణిపూర్‌లో 22 అసెంబ్లీ స్థానాలకు జరిగిన రెండవది, చివరి దశ పోలింగ్‌లో రికార్డు స్థాయిలో 86 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా, ఉత్తరప్రదేశ్‌లో ఫిబ్రవరి 11న ప్రారంభమయిన ఏడు విడతల పోలింగ్‌లో సగటున ఓటింగ్ 60-81 శాతంగా ఉంది. ఈ రోజు ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనా జరగలేదని పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి వెంకటేశ్ చెప్పారు. ప్రధాని లోక్‌సభ నియోజకవర్గమైన వారణాసిలో దాదాపుగా 61 శాతం పోలింగ్ జరిగింది. మరోవైపు మణిపూర్‌లో రెండో విడత పోలింగ్ జరిగిన 22 అసెంబ్లీ నియోజకవర్గాల్లోను ఓటర్లు భారీ సంఖ్యలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాయంత్రం పోలింగ్ సమయం ముగిసే సమయానికి రికార్డు స్థాయిలో 86 శాతం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు ఆయన చెప్పారు. కొండ ప్రాంతాల్లోని దాదాపు 25 శాతం పోలింగ్ కేంద్రాలనుంచి పూర్తి సమాచారం ఇంకా అందనందున పోలింగ్ శాతం మరింత పెరిగే అవకాశం ఉందని ఆయన చెప్పారు. బుధవారం ఓటు హక్కును వినియోగించుకున్న వారిలో ముఖ్యమంత్రి ఇబోబి సింగ్, హక్కుల ఉద్యమకారాణి ఇరోమ్ షర్మిల తదితరులున్నారు. కాగా, యుపితో సహా అసెంబ్లీ ఎన్నికలు జరిగిన మణిపూర్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు ఈ నెల 11న జరగనుంది.