జాతీయ వార్తలు

ప్యాకేజీకి చట్టబద్ధత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 15: ఆంధ్రప్రదేశ్‌కు ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీకి ఎట్టకేలకు కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసి చట్టబద్ధత కల్పించింది. విదేశీ ఆర్థిక సహాయంతో చేపట్టే పథకాలు, పోలవరం ప్రాజెక్టుకు ప్రత్యేక ఆర్థిక సహాయం చేయాలనే ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదించటం తనకు ఆనందం కలిగిస్తోందని కేంద్ర సమాచార, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు ట్వీట్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గం సమావేశంలో ఏపి ప్రత్యేక ప్యాకేజీకి ఆమోద ముద్ర వేశారు. అయితే పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నందున కేంద్ర మంత్రివర్గం తీసుకున్న ఈ నిర్ణయాన్ని అధికారికంగా వెల్లడించలేదు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీకి కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసే అంశం మంత్రివర్గ సమావేశంలో మూడో టేబుల్ అంశంగా వచ్చింది. దీనికి మంత్రివర్గం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ప్రత్యేక ప్యాకేజీలో భాగంగా పోలవరం ప్రాజెక్టుకు వంద శాతం నిధులు ఇవ్వటంతోపాటు ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని పర్యావరణ అనుమతులను కూడా కేంద్ర ప్రభుత్వమే సంపాదిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా వలన లభించే అన్ని ప్రయోజనాలను విదేశీ రుణాల ప్రాజెక్టులకు కల్పించాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించినట్లు తెలిసింది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా వలన కలిగే అన్ని ప్రయోజనాలను ప్రత్యేక ప్యాకేజీ రూపంలో కల్పించేందుకే కేంద్ర ప్రభుత్వం దీనికి చట్టబద్ధత కల్పించింది. ఏపికి ప్రత్యేక హోదా ఇచ్చి ఉంటే 2015-16 నుండి 2019-20సంవత్సరంలో రాష్ట్రానికి లభించే ఆర్థిక సహాయాన్ని ఇప్పుడు అదనపు ప్రత్యేక ఆర్థిక సహాయం చర్యల రూపంలో అందజేస్తారు. ఈ సహాయం విదేశీ రుణాల సహాయంతో చేపట్టిన పథకాలకు సంబందించిన రుణాలు, వడ్డీచెల్లింపు రూపంలో ఉంటుంది. పోలవరం ప్రాజెక్టులోని నీటిపారుదల కాంపోనెంట్‌కు నూటికి నూరు శాతం నిధులను కేంద్రం సమకూరుస్తుంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను కేంద్రం తరపున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తుంది. అయితే కేంద్ర జలవనరుల శాఖ పరిధిలోని పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన సమన్వయ బాధ్యతలు నిర్వహించటంతోపాటు నాణ్యత, డిజైన్, నిర్వహణ,అనుమతుల సంపాదించటం వంటి బాధ్యతలను కూడా చేపడుతుంది. కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలోని వ్యయ విభాగంతో కలిసి 2014 ఏప్రిల్ ఒకటోతేదీ నాడు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వ్యయం ఎంత అనేది కూడా పోలవరం అథారిటీ అంచనా వేస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు ప్రకటించిన ప్యాకేజీకి చట్టబద్దత కల్పించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నాయకత్వంలోని తెలుగుదేశం ప్రభుత్వం చాలా కాలం నుండి డిమాండ్ చేయటం తెలిసిందే. ప్రత్యేక హోదా స్థానంలో ఇస్తున్న ప్రత్యేక ప్యాకేజీకి కేంద్ర ప్రభుత్వం చట్టబద్దత కల్పిస్తేనే రాష్ట్ర ప్రజలకు దీని పట్ల విశ్వాసం కలుగుతుందని చంద్రబాబు వాదించటం తెలిసిందే.
ఇకపై హోదా నిన్నటిమాట : సుజనాచౌదరి
రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీకి కేంద్ర కేబినెట్ చట్టబద్ధత కల్పించటంతో ఇకపై ప్రత్యేకహోదా గురించి మాట్లాడాల్సిన అవసరం లేదని కేంద్రమంత్రి సుజనాచౌదరి పేర్కొన్నారు. ఢిల్లీలో సాయంత్రం టీడీపీ ఎంపీలతో కలిసి తన నివాసంలో విలేఖరులతో మాట్లాడుతూ ఏపీకి మేలు చేసేలా కేంద్ర మంత్రివర్గం నిర్ణయాలు తీసుకోవడం సంతోషకరమన్నారు. కొంత ఆలస్యమైన మిత్రపక్షమైన బీజేపీ ఆంధ్రప్రజల కోరికను నేరవేర్చిందన్నారు. ఏపీకి ప్రత్యేకహోదా వల్ల కలిగే ప్రయోజనాలతో సమానంగా ప్యాకేజీ వచ్చిందన్నారు.