జాతీయ వార్తలు

జయ మా అమ్మ ఈరోడ్ యువకుడు హల్‌చల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, మార్చి 15: జయలలిత మరణం తరువాత తమిళనాట రోజుకో నాటకీయ పరిణామాలు జరుగుతున్నాయి. తాజాగా కృష్ణమూర్తి అనే యువకుడు తాను జయలలిత కుమారుడినంటూ హడావుడి సృష్టించాడు. ఈరోడ్‌కు చెందిన అతడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గిరిజా వైద్యనాథన్‌ను కలిసి ఫిర్యాదు చేశాడు. జయలలిత ఏకైక కుమారుడిని తానేనంటూ మూర్తి చెప్పుకొచ్చాడు. జయలలితను శశికళే మెట్లపై నుంచి తోసేసిందని అతడు ఆరోపిస్తున్నాడు. ఇంతకాలం తాను జయలలిత స్నేహితురాలు వాణితమాణి ఇంట్లో ఉన్నానని కృష్ణమూర్తి స్పష్టం చేశాడు. అంతేకాదు 2016 సెప్టెంబర్ 14న పోయెస్ గార్డెన్‌లో జయలలిత ఇంటికి వెళ్లి ఆమెను కలిసినట్టు తెలిపాడు. ‘నన్ను తన కుమారుడిగా జయలలిత పరిచయం చేశారు. ఆ సందర్భంలోనే జయ, శశికళ మధ్య వాగ్వివాదం జరిగింది. కోపం పట్టలేని శశికళ మా అమ్మను మెట్లపై నుంచి తోసేసింది. సెప్టెంబర్ 22న ఈ సంఘటన జరిగింది’ అని గిరిజా వైద్యనాథన్‌కు అందజేసిన ఫిర్యాదులో అతడు వెల్లడించాడు.
అలాగే జయలలిత ఆస్తిపాస్తులకు తానే నిజమైన వారసుడినని, అవన్నీ తనకే చెందుతాయని కృష్టమూర్తి వాదిస్తున్నాడు. ఇలా ఉండగా తమిళనాడు అసెంబ్లీ మాజీ స్పీకర్ పిహెచ్ పాండియన్ కూడా జయలలిత మరణంపై ఇలాంటి ఆరోపణలే చేశారు. పోయెస్ గార్డెన్‌లో జయను మెట్లపైనుంచి తోసేశారని దీంతో ఆమెను అపోలో ఆసుపత్రికి తరలించినట్టు ఆయన చెప్పారు. జయలలిత మృతి తరువాత అన్నాడిఎంకె ఎంపీలు రెండుగా చీలిపోయారు. ఒక గ్రూపు మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్‌సెల్వంకు మద్దతుగా నిలిచారు. మరోవర్గం ముఖ్యమంత్రి ఇ పళనిస్వామితో ఉంది.