జాతీయ వార్తలు

కరవు రైతు కష్టం పట్టదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 22:జాతీయ ఆహార భద్రతా చట్టాన్ని చేపట్టి ఏళ్లు గడుస్తున్నా కరువు పీడిత రాష్ట్రాల్లో ఇంత వరకూ ఎందుకు అమలు చేయడం లేదంటూ ఆంధ్ర ప్రదేశ్, కర్నాటక, మహారాష్ట్ర, గుజరాత్ సహా తొమ్మిది రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు సుప్రీం కోర్టు బుధవారం సమన్లు పంపింది. ఈ చట్టాన్ని తీసుకు వచ్చి దీర్ఘకాలం గడిచిపోయినా సంబంధిత రాష్ట్రాలు మాత్రం దీన్ని అమలు చేయడంలో విఫలమయ్యాయని న్యాయమూర్తి ఎంబి లోకూర్ సారధ్యంలోని సుప్రీం కోర్టు బెంచి తీవ్ర స్వరంతో వ్యాఖ్యానించింది. పార్లమెంట్ చేపట్టిన ఓ చట్టానికి ఈ రాష్ట్రాలు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వక పోవడం విచారకరమని పేర్కొంది. రాజ్యాంగంలోని 21 అధికరణ కల్పిస్తున్న జీవన భద్రత, వ్యక్తిగత స్వేచ్ఛ వంటి వౌలిక అంశాలు కూడా ఈ చట్టం అమలులో నిబిడీకృతమై ఉన్నాయని స్పష్టం చేసింది. ఈ చట్టంలోని 16వ సెక్షన్‌లో నిర్దేశించినట్టుగా రాష్ట్రాల ఆహార కమిషన్ల ఏర్పాటు జరుగడం లేదని తెలిపింది. ఆహార కమిషన్లను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత రాష్ట్రాలదేనని, పార్లమెంట్ చేపట్టిన చట్టాన్ని అవి ఎంత మాత్రం విస్మరించజాలవని న్యాయమూర్తి ఎన్‌వి రమణతో కూడిన ఈ బెంచి ఉద్ఘాటించింది. రాష్ట్రాల ఉదాసీనత నేపథ్యంలోనే తొమ్మిది రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు సమన్లు పంపుతున్నామని సుప్రీం బెంచి స్పష్టం చేసింది. వీరు ఆహార కమిషన్ల ఏర్పాటు, అందుకు సంబంధించిన వివరాలను అందజేయాల్సి ఉంటుందని తెలిపింది. అలాగే కరువు ప్రాంతాల్లో మధ్యాహ్న భోజన పథకం అమలుకు సంబంధించి కూడా వివరణ ఇవ్వాలని వీరిని కోరింది. ఈ కేసు తదుపరి విచారణను వచ్చే నెల 26కు వాయిదా వేసింది. సుప్రీం సమన్లు పంపిన రాష్ట్రాల్లో బీహార్, మధ్యప్రదేశ్, జార్ఖండ్‌లు కూడా ఉన్నాయి. ఆహార భద్రతా చట్టంలోని కొన్ని నిబంధనలను అమలు చేసిన ఒడిసాను, ఆహార కమిషన్ల ఏర్పాటు ప్రక్రియను చేట్టిన తెలంగాణను సుప్రీం కోర్టు మినహాయించింది. ఇదే కారణంతో ఉత్తర ప్రదేశ్‌కూ మినహాయింపునిచ్చింది. కరువు పీడిత రాష్ట్రాల్లోని రైతులకు తగిన వెసులుబాటు కల్పించాలంటూ స్వరాజ్ అభియాన్ అనే ఎన్‌జివో సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ను పురస్కరించుకుని తొమ్మిది రాష్ట్రాల తీరును సర్వోన్నత న్యాయస్థానం ఎండగట్టింది. రైతుల రుణాల మాఫీ, రుణాల చెల్లింపు గడువు పెంచడానికి సంబంధించిన మార్గదర్శకాలు జారీ అయినప్పటికీ వాటిని అమలు చేయనందుకు ఈ కేసులో రిజర్వ్ బ్యాంకును కూడా భాగస్వామిని చేస్తూ సుప్రీం కోర్టు నిర్ణయం తీసుకుంది.