జాతీయ వార్తలు

వివక్షకు తావివ్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోరఖ్‌పూర్, మార్చి 25: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత యోగి ఆదిత్యనాథ్ తొలిసారి తన నియోజకవర్గమైన గోరఖ్‌పూర్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. జెండాలతో పట్టణమంతా కాషాయమయంగా మారిపోయింది. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ఆదిత్యనాథ్ మాట్లాడుతూ అందరి అభివృద్ధి కోసం పని చేసే, ఏ కులం, వర్గం పట్ల వివక్ష, బుజ్జగింపును ప్రదర్శించని ప్రభుత్వాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. గతంలో రెచ్చగొట్టే తీరులో మాట్లాడే ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ ధోరణికి భిన్నంగా తన మద్దతుదారులను జోరు తగ్గించుకోవాలని కోరడం విశేషం. గెలుపు జోష్‌తో వివేకాన్ని కోల్పోవద్దని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని హితవు పలికారు. ముఖ్యమంత్రి పదవి చేపట్టినందుకు తనను సన్మానించడానికి ఏర్పాటుచేసిన ఈ సభలో ఆదిత్యనాథ్ తనకుముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి, బిజెపి అధ్యక్షుడు అమిత్ షాకు కృతజ్ఞతలు తెలిపారు. తన ప్రసంగంలో అధిక భాగం మోదీ అభివృద్ధి అజెండా గురించే ప్రస్తావించిన ఆదిత్యనాథ్ ప్రజలకోసం ప్రభుత్వం చేపట్టే పథకాలు ప్రతి ఒక్కరికీ అందాలని ప్రధాని కోరుకుంటున్నారని, అలాంటి పాలననే రాష్ట్రంలో కూడా అందించడానికి కృషి చేస్తామని చెప్పారు. ‘ఇక్కడ కులం, మతం, భావాలు, లింగభేదం ఆధారంగా ఎలాంటి వివక్షా ఉండదు. అందరికోసం అభివృద్ధి ఉంటుంది, అలాగే ఎవరికీ బుజ్జగింపు ఉండదు’ అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
మానస సరోవర్ యాత్రకు సాయం పెంపు
లక్నో: ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆదిత్యనాథ్ తొలివరాన్ని మానస సరోవర్ యాత్రికులకోసం ప్రకటించారు. రాష్ట్రంనుంచి కైలాస్ మానస సరోవర్ యాత్రకు వెళ్లే యాత్రికులకు ఇచ్చే గ్రాంట్‌ను రూ.50 వేలనుంచి లక్షకు రెట్టింపు చేస్తున్నట్లు ప్రకటించారు. యాత్రికుల ప్రయోజనార్థం, ఢిల్లీ సమీపంలో కానీ వేరే రాష్ట్రంలోని ఏ ఇతర ప్రాంతంలో కానీ రాష్ట్ర ప్రభుత్వం ఒక మానస సరోవర్ భవన్‌ను నిర్మిస్తుందని కూడా ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి సెక్రటేరియట్‌లో శనివారం జరిగిన ఓ సమావేశానికి అధ్యక్షత వహించిన ఆదిత్యనాథ్ ఈ ఆర్థిక సాయంవల్ల మానస సరోవర్ యాత్రకు ప్రోత్సాహం లభిస్తుందన్నారు. ఇంతకుముందు అఖిలేశ్ యాదవ్ ప్రభుత్వం కూడా మానస సరోవర్ యాత్రికులకు ఇచ్చే గ్రాంట్‌ను 25 వేలనుంచి 50 వేలకు పెంచింది. తాము ఉత్తరప్రదేశ్‌కు చెందిన వాళ్లమని సర్టిఫై చేస్తూ నివాస ధ్రువీకరణ పత్రం లేదా పాస్‌పోర్టు కాపీని సమర్పించే యాత్రికులకు ఈ ఆర్థిక సహాయం లభిస్తుంది.