జాతీయ వార్తలు

కాశ్మీర్ లోయకు అదనపు బలగాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, మార్చి 29: కాశ్మీర్ లోయలో పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారాయి. భద్రతా సిబ్బంది కాల్పుల్లో ముగ్గురు పౌరులు మృతిచెందిన నేపథ్యంలో వేర్పాటువాదులు సమ్మెకు పిలుపునిచ్చారు. దీంతో లోయలోని సమస్యాత్మక ప్రాంతాలకు అదనపు బలగాలు తరలించారు. కాశ్మీర్ యూనివర్శిటీ, సెంట్రల్ యూనివర్శిటీ, ఇస్లామిక్ యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో జరగాల్సిన పరీక్షలన్నీ వాయిదా పడ్డాయి. బుధవారం నాడు భద్రతాదళాలపై స్థానికులు రాళ్లదాడికి దిగారు. ఈ సందర్భంగా భద్రతాదళాల జరిపిన కాల్పుల్లో ముగ్గురు పౌరులు మృతిచెందగా, 18 మంది గాయపడ్డారు. కాశ్మీర్ జిల్లా బుద్గావ్‌లో ఓ మిలిటెంట్ మృతికి నిరసనగా ఆందోళనలు మొదలయ్యాయి. షాపులు, వాణిజ్య సముదాయాలు, పెట్రోల్ బంకులు, విద్యా సంస్థలు దాదాపు అన్నీ మూతపడ్డాయి. కొన్ని ప్రాంతాల్లో ప్రైవేటు వాహనాలు రోడ్లపై తిరిగాయని, ఆర్టీసి బస్సులు కనిపించలేదని అధికారులు వెల్లడించారు. కాశ్మీర్‌లోయలోని పలు జిల్లా ప్రధాన కేంద్రాల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగింది. దిగువ ప్రాంతాల్లో శాంతిభద్రతలు క్షీణించకుండా సాయుధ బలగాలను రంగంలోకి దించినట్టు వారు వెల్లడించారు. హురియత్ కాన్ఫరెన్ రెండు గ్రూపుల అధినేతలు సయ్యద్ అలీ షా గిలానీ, మిర్వైజ్ ఒమర్ ఫరూక్, జెకెఎల్‌ఎఫ్ చీఫ్ మహ్మద్ యాసిన్ మాలిక్‌లు సమ్మెకు పిలుపునిచ్చారు. శుక్రవారం ప్రార్థనలు ముగిసిన తరువాత నిరసన ప్రదర్శనలు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.
chitram...
శ్రీనగర్‌లో బుధవారం అల్లర్లకు దిగిన యువతపైకి ప్రయోగించిన
భాష్పవాయు గోళాలను తిరిగి వారిపైకే విసిరేస్తున్న యువకులు