జాతీయ వార్తలు

నగదు జమ చేయకుంటే ఆస్తుల వేలం తప్పదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 6: సహారా గ్రూప్ ఈ నెల 17నాటికి సెబి-సహారా రిఫండ్ అకౌంట్‌లో రూ. 5092.6 కోట్లు డిపాజిట్ చేయకుంటే, పుణె సమీపంలోని యాంబీ వ్యాలీలో గల ఆ సంస్థకు చెందిన రూ. 39వేల కోట్ల విలువ గల ఆస్తులను వేలం వేయడం జరుగుతుందని సుప్రీంకోర్టు గురువారం స్పష్టం చేసింది. తాను గతంలో జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా ఏప్రిల్ 17నాటికి రూ. 5092.6 కోట్లు డిపాజిట్ చేయవలసిందేనని, ఈ గడువును పొడిగించడం లేదని న్యాయమూర్తి దీపక్ మిశ్రా నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం సహారా గ్రూప్ తరపు న్యాయవాదికి తెలిపింది. సెబి-సహారా రిఫండ్ అకౌంట్‌లో ఈ మొత్తాన్ని జమ చేయడానికి విధించిన గడువును పొడిగించాలని సహారా గ్రూప్ న్యాయవాది చేసిన అభ్యర్థనను తోసిపుచ్చుతూ సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. పెద్ద మొత్తంలో నగదు రిఫండ్ అకౌంట్‌లో జమ కావలసిందేనని తాను ఇదివరకే స్పష్టం చేయడం జరిగిందని ధర్మాసనం గుర్తు చేసింది. లేకుంటే, యాంబీ వ్యాలీలోని ఆస్తులను వేలం వేయక తప్పదని పేర్కొంది. గడువు పొడిగించాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించాలని సహారా తరపు న్యాయవాది అభ్యర్థించగా, ఈ కేసు తదుపరి విచారణకు నిర్ణయించిన తేదీ నాటి కేసుల జాబితాలో సుప్రీంకోర్టు రిజిస్ట్రీ ఈ పిటిషన్‌ను చేరుస్తారని ధర్మాసనం తెలిపింది. గణనీయ మొత్తంలో నగదును డిపాజిట్ చేస్తే, ఈ కోర్టు గడువును పొడిగించే అంశాన్ని పరిశీలిస్తుందని, లేకుంటే తగిన ఆదేశాలు జారీ చేస్తుందని సుప్రీంకోర్టు ఫిబ్రవరి 28న సహారా గ్రూప్‌కు చెప్పింది.