జాతీయ వార్తలు

లిక్కర్ కింగ్ మాల్యా అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిబిఐకి లండన్ పోలీసుల సమాచారం
మూడు గంటల్లోనే బెయిల్ మంజూరు
త్వరలోనే భారత్‌కు అప్పగింత?
అంత తేలిక కాదంటున్న న్యాయ నిపుణులు

న్యూఢిల్లీ, ఏప్రిల్ 18: బ్యాంకులకు వేల కోట్ల రూపాయల ఎగొట్టి లండన్ పారిపోయిన లిక్కర్ కింగ్ విజయ్‌మాల్యాను అక్కడ పోలీసులు అరెస్టు చేశారు. లండన్ కాలమాన ప్రకారం మంగళవారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో స్కాట్‌లాండ్ యార్డ్ పోలీసులు మాల్యాను అరెస్టు చేశారు. జాతీయ బ్యాంకులకు తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఎగవేసి మాల్యా లండన్ పారిపోయారు. మాల్యా అరెస్టు విషయాన్ని బ్రిటన్ అధికారులు ఇక్కడ సిబిఐ అధికారులకు సమాచారం అందించారు. తాజా అరెస్టుతో ఆయనను భారత్‌కు రప్పించడానికి మార్గం సుగమం అయింది. బ్యాంకులను మోసం చేసిన ఆర్థిక నేరస్తుడు మాల్యాను తమకు అప్పగించాలని భారత్ ఎప్పటి నుంచో అడుగుతోంది. స్కాట్‌లాండ్ యార్డ్ పోలీసులు మాల్యాను అరెస్టు చేసి వెస్‌మినిస్టర్స్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. వాదోపవాదాలు విన్న న్యాయమూర్తి 61 ఏళ్ల మాల్యాకు బెయిల్ మంజూరు చేశారు. మూడుగంటల్లోనే లిక్కర్ కింగ్‌కు బెయిల్ రావడం గమనార్హం. కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్ కోసం బ్యాంకుల నుంచి రుణం తీసుకున్న విజయ్ మాల్యా కట్టకుండా ఎగవేశారు. కాగా గత నెలలోనే కేంద్ర విదేశాంగ మంత్రిత్వశాఖ విజయమాల్యాను అప్పగించాల్సిందిగా బ్రిటన్ ప్రభుత్వాన్ని కోరింది. జాతీయ బ్యాంకుల నుంచి రుణం తీసుకుని ఆ సొమ్ములను విదేశీ బ్యాంకుల్లో పిల్లల ఖాతాల్లోకి బదిలీ చేశారని మాల్యాపై కేసు నమోదైంది. గత మార్చిలో కేసు విచారించిన సుప్రీం కోర్టు తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. అంతకు ముందు స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని కన్సొర్టియం ఆఫ్ బ్యాంక్స్ పిటిషన్‌ను విచారించిన సుప్రీం కోర్టు మాల్యాకు నోటీసులు జారీ చేసింది. ఐడిబిఐకి 720 కోట్ల రూపాయలు ఎగవేసిన కేసుకు సంబంధించి జనవరిలో సిబిఐ కోర్టు ఆయనకు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.
అప్పగింత అంత తేలికకాదు?
విజయ్ మాల్యాను భారత్‌కు తీసుకురావడం అన్నది అంత తేలికకాదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. యుకెలోని కోర్టులు పూర్తిస్థాయి స్వతంత్రతతో పనిచేస్తాయని మాల్యాను భారత్‌కు అప్పగించడానికి అవి అంత తేలిగా ఒప్పుకునే అవకాశం ఉండదని సీనియర్ న్యాయవాదులు కెటిఎస్ తులసీ, దుశ్యంత్ దావెలు అభిప్రాయపడ్డారు. మాల్యాను అప్పగించాలని అభ్యర్థించిన భారత్ అతడిపై దాఖలైన కేసులను, ఆర్థిక నేరాల ఆధారాలను బ్రిటన్ కోర్టులకు అందించినప్పటికీ వీటిని క్షుణ్ణంగా పరిశీలించి అన్ని కోణాల్లోనూ విశే్లషిస్తే తప్ప దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం లేదని తులసీ తెలిపారు. అరెస్టు చేసిన మూడుగంటల వ్యవధిలోనే ఆయనకు బెయిల్ రావడాన్ని బట్టిచూస్తే ఈ విషయం స్పష్టమవుతోందని ఆయన వెల్లడించారు. ఒక నేరస్తుడిని అతడి మాతృదేశానికి అప్పగించాలంటే అరెస్టు చేసిన 60 రోజుల తరువాత గానీ బెయిల్ ఇచ్చే అవకాశం ఉండదని, అయితే మాల్యాకు కొన్ని గంటల వ్యవధిలోనే బెయిల్ వచ్చిందని తెలిపారు. ఇప్పటి వరకూ లిక్కర్‌కింగ్‌ను అప్పగించాలని కోరుతూ భారత్ 50 అభ్యర్థనలు చేసింది. వాటిల్లో ఒక్కదాన్ని మాత్రమే బ్రిటన్ కోర్టులు విచారణకు చేపట్టాయి. మరో న్యాయవాది దావె కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే బ్రిటన్ కోర్టులు ఇలాంటి కేసుల్లో అనుసరించే విధానం ఏమిటో తనకు స్పష్టంగా తెలియదని పేర్కొన్నారు.