జాతీయ వార్తలు

జాదవ్‌ను విడిపించడానికి అంతర్జాతీయ సాయం తీసుకోవాలంటూ పిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 18: గూఢచర్యం ఆరోపణలపై పాకిస్తాన్ మిలిటరీ కోర్టు మరణశిక్ష విధించిన కులభూషణ్ జాదవ్‌ను తక్షణం విడిపించుకోవడంలో అంతర్జాతీయ న్యాయస్థానం సాయం తీసుకోవాలని కోరుతూ మంగళవారం ఢిల్లీ హైకోర్టులో ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలయింది. కులభూషణ్ జాదవ్‌ను విడిపించుకునేందుకు అంతర్జాతీయ న్యాయస్థానంద్వారా ఉన్న మార్గాలపై కేంద్రం స్పందనను ఆ పిల్‌లో కోరారు. మరణ శిక్షను ఎదుర్కొంటున్న భారతీయ ఖైదీని కలుసుకోవడానికి అనుమతించాలని భారత్ గట్టిగా కోరినప్పటికీ పాకిస్తాన్ సైన్యం మాత్రం కాన్సులేట్ అధికారులు జాదవ్‌ను కలుసునేందుకు అనుమతించేది లేదని సోమవారం స్పష్టం చేసిన తర్వాత ఈ పిల్‌ను దాఖలు చేశారు. ‘చట్టప్రకారం గూఢచర్యానికి పాల్పడిన కులభూషణ్‌కు కాన్సులర్ యాక్సెస్ ఇవ్వలేము’ అని పాకిస్తానీ మిలిటరీ అధికార ప్రతినిధి మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ సోమవారం ఇస్లామాబాద్‌లో విలేఖరులకు చెప్పారు. అయితే దీనికి సంబంధించి పాక్ అధికారులనుంచి తమకు ఎలాంటి సమాచారం అందలేదని భారత అధికారులు చెప్తున్నారు. జాదవ్‌ను తమ కాన్సులేట్ అధికారులు కలవడానికి అనుమతించాలని కోరుతూ గత ఏడాది కాలంలో మన దేశం చాలాసార్లు కోరినప్పటికీ పాకిస్తాన్ తిరస్కరిస్తూనే వస్తోంది.

మతం ఆధారంగా రిజర్వేషన్లు
రాజ్యాంగ విరుద్ధం: వెంకయ్య

న్యూఢిల్లీ, ఏప్రిల్ 18: తెలంగాణ ప్రభుత్వం మతం ఆధారంగా రిజర్వేషన్లు కల్పించటం రాజ్యాంగ విరుద్ధమని కేంద్ర సమాచార, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. ఇలాంటి రిజర్వేషన్ల వల్ల మరిన్ని సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉన్నదని ఆయన హెచ్చరించారు. మతం ఆధారంగా రిజర్వేషన్లు కల్పిస్తూ గతంలో తీసుకున్న నిర్ణయాలను కోర్టులు కొట్టివేశాయనేది మరిచిపోరాదని ఆయన అన్నారు. మతం ఆధారంగా రిజర్వేషన్లు కల్పించటాన్ని రాజ్యాంగ నిర్మాతలు వ్యతిరేకించారు, అందుకే మతం ఆధారంగా రిజర్వేషన్లు కల్పించే అంశాన్ని రాజ్యాంగంలో పొందుపరచలేదని వెంకయ్యనాయుడు వివరించారు. కాన్సిట్యూయెంట్ అసెంబ్లీ కూడా మతం ఆధారంగా రిజర్వేషన్లు కల్పించటాన్ని వ్యతిరేకించిందని ఆయన చెప్పారు. హిందువులు, జైనులు, ముస్లింలు, క్రైస్తువుల్లో ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాల వారికి రిజర్వేషన్లు కల్పించేందుకు తాము వ్యతిరేకులం కాదని ప్రకటించారు.