జాతీయ వార్తలు

కలిసి మాట్లాడుకుందాం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏకకాల ఎన్నికలపై ప్రధాని మోదీ పిలుపు

నీతి ఆయోగ్ సహకార సమాఖ్యకు స్ఫూర్తి
నవభారతానికి ‘టీమ్ ఇండియా’ సమాయత్తం
ముఖ్యమంత్రుల హాజరుపై పిఎం ప్రశంస
ఆయోగ్ భేటీకి మమత, కేజ్రీవాల్ గైర్హాజరు

న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించే అంశంపై చర్చ, సంప్రదింపులు మరింత విస్తృతంగా జరగాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. గత కొంత కాలంగా ఏకకాల ఎన్నికలకు సంబంధించిన ఊహాగానాలు బలపడుతున్న నేపథ్యంలో ఆదివారం ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ భేటీలో మోదీ ఈ అంశాన్ని ప్రస్తావించడం గమనార్హం. ఒకే దేశం, ఒకే ఆశయం, ఒకే నిబద్ధత అన్న నినాదంతో భారత్‌ను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతో ఉందని మోదీ ఉద్ఘాటించారు. కేంద్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వస్తు సేవల పన్ను చట్టం (జిఎస్‌టి) ఇందుకు నిదర్శనమన్నారు. సహకార సమాఖ్య స్ఫూర్తికి నిదర్శనంగా జిఎస్‌టి చరిత్రలో నిలిచిపోతుందన్నారు. నీతి ఆయోగ్ నిర్వాహక మండలి మూడో వార్షిక భేటీకి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కావడాన్ని ప్రస్తావించిన మోదీ ‘టీమ్ ఇండియా మరోసారి సమావేశమైంది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా భారత్‌ను ముందుకు తీసుకెళ్లేందుకు సన్నద్ధమైంది’అని ఉద్ఘాటించారు. సైద్ధాంతిక, రాజకీయ విభేదాలను పక్కన పెట్టి ఈ సమావేశానికి హజరై దేశ భవితపై జరిగిన చర్చల్లో పాల్గొన్నందుకు ముఖ్యమంత్రులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఈ సమావేశానికి హాజరు కాకపోవడం గమనార్హం. కాగా, అన్ని రాష్ట్రాలు, అందరు ముఖ్యమంత్రుల సమష్టి కృషితోనే నవ భారత లక్ష్య సాధన సాధ్యమని మోదీ ఉద్ఘాటించారు. వివిధ విధానాలపై పరస్పరం అభిప్రాయాలు పంచుకోవడానికి, అమలుకు సంబంధించి లోపాలను సరిదిద్దుకోవడానికి ఈ సమావేశం ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. 2022నాటికి భారత్‌కు స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతుందని..అప్పటిలోగా నిర్దేశిత లక్ష్యాలను సాకారం చేసుకుని నవభారతాన్ని ఆవిష్కృతం చేయడానికి కలసికట్టుగా ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. సరికొత్త ఉత్తేజంతో భారత్‌ను ముందుకు తీసుకెళ్లేందుకు నీతి ఆయోగ్ అవసరమైన అన్ని చర్యలూ చేపడుతోందన్నారు. అనుకున్న ఫలితాలను సాధించేందుకు ప్రభుత్వ, ప్రైవేటు, పౌరసమాజం సమన్వయంతో పనిచేయాలని ఉద్ఘాటించారు. ‘నీతి ఆయోగ్ సహకార సమాఖ్య వ్యవస్థ. ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలతో ముందుకు రావడమే దీని బలం. అంతేకానీ పాలనాపరమైన, ఆర్థిక పరమైన నియంత్రణ ఎంత మాత్రం కాదు’అని ప్రధాని స్పష్టం చేశారు. పదిహేను సంవత్సరాల దీర్ఘకాల దృక్పథం, ఏడేళ్ల మధ్యస్థాయి వ్యూహం, మూడేళ్ల కార్యాచరణే లక్ష్యంగా నీతి ఆయోగ్ పని చేస్తోందన్నారు. ముఖ్యమంత్రులతో ఏర్పాటు చేసిన ఉప బృందాలు అందించిన అధ్యయన నివేదికలు డిజిటల్ చెల్లింపులు, నైపుణ్య అభివృద్ధి, స్వచ్ఛ్భారత్ వంటి వాటిని శక్తిమంతంగా తీర్చిదిద్దేందుకు ఎంతగానో దోహదం చేశాయన్నారు. ముఖ్యమంత్రుల అభిప్రాయాలకు ఎంతో ప్రాధాన్యతనిస్తున్నామని పేర్కొన్న మోదీ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించాల్సిన పథకాల గురించి, అలాగే వాటిని ఏ ప్రాతిపదికన నిర్వహించాలన్నదానిపైనా మొట్ట మొదటిసారిగా ముఖ్యమంత్రుల సిఫార్సులు కోరామన్నారు. నిధుల పరంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ వీరి సిఫార్సులను వెంటనే ఆమోదించడం జరిగిందని తెలిపారు. గత రెండు సంవత్సరాల కాలంలో రాష్ట్రాలకు కేటాయించిన నిధులు మొత్తం మీద 40శాతం మేర పెరిగాయని ప్రధాని గుర్తు చేశారు. అలాగే కేంద్ర పథకాలతో సంబంధం ఉన్న నిధులు కూడా 40శాతం నుంచి 25శాతానికి తగ్గాయని అన్నారు. మూల ధన వ్యయాన్ని వేగవంతం చేయడంతో పాటు వౌలిక సదుపాయాల అభివృద్ధిపైనా దృష్టి పెట్టాలని రాష్ట్రాలకు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. కేంద్ర బడ్జెట్‌ను ముందుగానే ప్రతిపాదించాలన్న చారిత్రక నిర్ణయం వల్ల ఆర్థిక సంవత్సరం ప్రారంభానికే నిధులు ఆందుబాటులోకి వచ్చే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇంతకు ముందు మే నెల వరకూ బడ్జెట్ కేటాయింపులకు పార్లమెంట్ ఆమోదం లభించేది కాదని, ఆ తర్వాతే రాష్ట్రాలకు మంత్రిత్వ శాఖలకు సమాచారం వెళ్లేదని గుర్తు చేశారు. అప్పటికే రుతుపవనాలు వచ్చేసేవి కాబట్టి వివిధ పథకాల వల్ల ఉద్దేశించిన ప్రయోజనాలు నీరుగారిపోయేవన్నారు.

ఆదివారం ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ భేటీలో మాట్లాడుతున్న ప్రధాని నరేంద్ర మోదీ