జాతీయ వార్తలు

చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్‌గా మాథుర్ ప్రమాణ స్వీకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 4: భారత దేశ ఎనిమిదవ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్‌గా రక్షణ శాఖ మాజీ కార్యదర్శి ఆర్‌కె.మాథుర్ (62) సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. న్యూఢిల్లీలోని రాష్టప్రతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రణబ్ ముఖర్జీ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. త్రిపుర క్యాడర్‌కు చెందిన రిటైర్డ్ ఐఎఎస్ అధికారి అయిన 62 ఏళ్ల మాథుర్ రక్షణ శాఖ కార్యదర్శిగా రెండేళ్ల పదవీ కాలాన్ని గత ఏడాది మే నెలలో పూర్తి చేశారు. ప్రస్తుతం చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్‌గా ఆయన మూడేళ్లు పదవిలో కొనసాగుతారు. 14 రోజుల శీతాకాల విడిది నిమిత్తం దక్షిణ భారత దేశానికి వెళ్లిన రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ డిసెంబర్ 31వ తేదీన ఢిల్లీకి తిరిగి వచ్చిన విషయం తెలిసిందే. దీంతో సిఐసి ప్రమాణ స్వీకారం ఇంతకుముందు జరగలేదు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు మల్లిఖార్జున్ ఖర్గే సభ్యులుగా ఉన్న సెలెక్షన్ కమిటీ డిసెంబర్ 16వ తేదీన మాథుర్‌ను తదుపరి చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్‌గా ఎంపిక చేసింది.