జాతీయ వార్తలు

ప్రతీకారం తప్పదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయపూర్, ఏప్రిల్ 25: చత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో సోమవారం నక్సలైట్లు జరిపిన మెరుపుదాడిలో 25మంది సిఆర్‌పిఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయిన సంఘటనతో కదిలి పోయిన కేంద్ర ప్రభుత్వం నక్సల్స్‌పై పోరులో ప్రభుత్వ వ్యూహాన్ని సమీక్షించుకుంటామని మంగళవారం ప్రకటించింది. మరోవైపు చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ మరో అడుగు ముందుకేసి రాబోయే రోజుల్లో నక్సల్స్‌పై మరింత తీవ్రస్థాయిలో పకడ్బందీగా ఆపరేషన్లు చేపట్టనున్నట్లు ప్రకటించారు. అంతేకాదు 25 మంది జవాన్లను పొట్టన పెట్టుకున్న మావోయిస్టులపై అదే స్థాయిలో ప్రతీకారం తీర్చుకుంటామని కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నాయి. మంగళవారం ఉదయం ఢిల్లీనుంచి ఇక్కడికి చేరుకున్న కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్న మాటలే దీనికి నిదర్శనం. ‘మన వీర జవాన్ల బలిదానం వృథా కానివ్వం’ అని ముఖ్యమంత్రి రమణ్ సింగ్‌తో కలిసి విలేఖరులతో మాట్లాడుతూ రాజ్‌నాథ్ అన్నారు. అంతేకాదు వామపక్ష ఉగ్రవాదాన్ని తుదముట్టించేందుకు మార్గాలను అనే్వషించేందుకు వచ్చే నెల 8న మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలతో సమావేశం నిర్వహించనున్నట్లు కూడా ఆయన చెప్పారు. ‘నక్సలైట్లపై వ్యూహాలను సమీక్షిస్తాం. అవసరమైతే మా వ్యూహాలను మార్చుంటాం’ అని మనా క్యాంప్‌లో ఉంచిన చెందిన సిఆర్‌పిఎఫ్ జవాన్ల మృత దేహాలకు నివాళి అర్పించిన అనంతరం రాజ్‌నాథ్ చెప్పారు. నక్సల్స్‌పై కేంద్రం ద్విముఖ వ్యూహాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అందుల్లో ఒకటి సాయుధ దాడులు కాగా, మరోటి రోడ్ల నిర్మాణం, ఆస్పత్రులు, పాఠశాలలు నిర్మించడంలాంటి అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం. రాష్ట్రంలో అభివృద్ధిని అస్థిరపరచాలని నక్సల్స్ అనుకుంటున్నారని, అందుకే వారు గిరిజనులను రక్షణ కవచాలుగా వాడుకుంటున్నారని రాజ్‌నాథ్ అన్నారు. నిన్నటి దాడిని పాశవిక చర్యగా అభివర్ణించిన ఆయన ఇది నిరాశతో చేసిన క్రూరమైన హత్యగా పేర్కొన్నారు. ఈ దాడిని తాము సవాలుగా తీసుకుంటున్నామని కూడా ఆయన చెప్పారు. కాగా, రాబోయే రోజుల్లో నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్లు మరింత పకడ్బందీగా, పట్టుదలతో చేపట్టడం జరుగుతుందని హోం మంత్రితో పాటుగా విలేఖరుల సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రమణ్ సింగ్ చెప్పారు. అమర జవాన్లకు నివాళి అర్పించిన అనంతరం రాజ్‌నాథ్ సింగ్ ముఖ్యమంత్రితో కలిసి రామకృష్ణ కేర్ ఆస్పత్రికి వెళ్లి అక్కడ చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. మనా క్యాంప్‌లో జరిగిన నివాళి కార్యక్రమంలో చత్తీస్‌గఢ్ గవర్నర్ బలరాంజీ దాస్ టాండన్, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హన్సరాజ్ అహిర్, రాష్ట్ర, సిఆర్‌పిఎఫ్ ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. కాగా, సిఆర్‌పిఎఫ్‌కు ఇప్పటివరకు పూర్తిస్థాయి డైరెక్టర్ జనరల్‌ను ఎందుకు నియమించలేదని విలేఖరులు రాజ్‌నాథ్‌ను అడగ్గా, నాయకత్వ కొరత లేదని, అవసరమైనప్పుడు ఒక సీనియర్ అధికారిని ఇక్కడ నియమిస్తామని ఆయన చెప్పారు.

చిత్రం... ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సిఆర్‌పిఎఫ్ జవాన్లను పరామర్శిస్తున్న హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్