జాతీయ వార్తలు

ప్రణాళికాబద్ధంగా ఇన్‌ఫ్రా ప్రాజెక్టుల పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 26: వౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టుల పూర్తికి సంబంధించి పటిష్ఠమైన ప్రణాళికాబద్ధ విధానంతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని, నిర్ణయించిన కాలపరిమితులను కచ్చితంగా పాటించాలని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. మంగళవారం రాత్రి జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ప్రధాని రోడ్లు, రైల్వేలు, విమానాశ్రయాలు, డిజిటల్ రంగాల ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించారు. ఈ సమావేశంలో నీతి ఆయోగ్ సిఈఓ అమితాబ్ కాంత్ అనేక రంగాల్లో, వౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టుల్లో గణనీయమైన పురోగతి సాధించినట్లు పేర్కొంటూ, దీనికి సంబంధించి ఒక ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద రోజుకు సగటున 130 కిలోమీటర్ల చొప్పున గ్రామీణ రోడ్ల నిర్మాణాన్ని సాధించడం జరిగిందని, దీని ఫలితంగా 2016-17లో అదనంగా 47,400 కిలోమీటర్ల ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన రోడ్ల నిర్మాణం జరిగిందని, అదనంగా 11,641 గ్రామాలను రోడ్లతో అనుసంధానం చేయడం జరిగిందని నాలుగు గంటలకుపైగా సుదీర్ఘంగా సాగిన ఆ సమావేశంలో ఇచ్చిన ప్రజెంటేషన్‌లో తెలియజేశారు. గ్రీన్ టెక్నాలజీని ఉపయోగించి 4వేల కిలోమీటర్లకు పైగా రోడ్లను నిర్మించడం జరిగిందని ఈ సమావేశంపై ప్రధానమంత్రి కార్యాలయం బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటన తెలిపింది. గ్రామీణ రోడ్ల నిర్మాణం, వాటి నాణ్యతలను ఎప్పటికప్పుడు కచ్చితంగా పర్యవేక్షించాలని ప్రధాని ఆదేశించారు. దీనికోసం ఇప్పటికే అందుబాటులో ఉన్న టెక్నాలజీలకుతోడు స్పేస్ టెక్నాలజీని కూడా ఉపయోగించుకోవాలని ఆయన నొక్కి చెప్పారు. వీలయినంత త్వరగా గ్రామాలను అనుసంధానం చేయడానికి ముఖ్యమైన లింక్‌లను కూడా పూర్తిచేయాలని ప్రధాని పిలుపునిచ్చినట్లు ఆ ప్రకటన తెలిపింది. రోడ్ల నిర్మాణంలో కూడా నూతన టెక్నాలజీలని ఉపయోగించాలని కూడా ఆయన ఆదేశించారు. వౌలిక సదుపాయాల కల్పనకు టెక్నాలజీని ఉపయోగించుకోవడంలో అంతర్జాతీయంగా పాటిస్తున్న ప్రమాణాలను పరిశీలించాలని, భారత్‌లో వాటి అమలు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ఆయన నీతి ఆయోగ్‌ను కోరారు.
జాతీయ రహదారుల రంగంలో 2016-17 ఆర్థిక సంవత్సరంలో 26వేల కిలోమీటర్లకు పైగా ఆరులేన్లు, నాలుగులేన్ల జాతీయ రహదారులను నిర్మించడం జరిగిందని, ఇది మరింత వేగం పుంజుకొంటోందని సమావేశంలో తెలిపారు. ఇక రైల్వేల రంగంలో 2016-17 ఆర్థిక సంవత్సరంలో 400 కిలోమీటర్ల కొత్త రైలు మార్గాలను వేయాలని లక్ష్యంగా పెట్టుకోగా 953 కిలోమీటర్ల కొత్త లైన్లు వేయడం జరిగింది. అలాగే 2వేల కిలోమీటర్లకు పైగా రైలు మార్గాలను విద్యుదీకరించగా, వెయ్యి కిలోమీటర్లకు పైగా గేజ్ మార్పిడి జరిగింది. అలాగే 1500కు పైగా కాపలా లేని లెవల్ క్రాసింగ్‌లను తొలగించడం జరిగింది. ప్రయాణికుల సదుపాయాలను పెంచడంలో భాగంగా 115 రైల్వే స్టేషన్లలో వైఫై సదుపాయాన్ని కల్పించగా, అదనంగా 34 వేల బయో టాయిలెట్లను ఏర్పాటు చేయడం జరిగింది. రైల్వే స్టేషన్ల పునరభివృద్ధికి సంబంధించిన పనులను వేగవంతం చేయాలని, ప్రయాణికుల చార్జీయేతర రాబడిని పెంచడంలో మరింత సృజనాత్మకతను చూపించాలని ప్రధాని ఆదేశించారు. రోడ్లు, రైల్వే రంగాలకు చెందిన పలుముఖ్యమైన ప్రాజెక్టుల పురోగతిని ఈ సమావేశంలో సమీక్షించారు. విమానయానం, రేవులు, డిజిటల్ రంగాల ప్రగతిని కూడా ప్రధాని సమీక్షించారు.
chitram...
ఇన్‌ఫ్రా ప్రాజెక్టుల పురోగతిపై వివిధ రంగాలకు చెందిన అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ