జాతీయ వార్తలు

నక్సల్స్ అణచివేతకు వ్యూహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 7: మావోయిస్టులపై చేస్తున్న పోరాట వ్యూహం పునఃసమీక్షే ప్రధాన అజెండాగా కేంద్ర హోంశాఖ నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాలతో సమీక్షా సమావేశం నిర్వహించనుంది. దేశంలో వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాలలోని ప్రస్తుత పరిస్థితులపై హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన సోమవారం ఢిల్లీలో సమావేశం జరగనుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బిహా ర్, చత్తీస్‌గఢ్, జార్ఖండ్, మహాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలకు చెందిన హోం మంత్రులు, ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొనున్నారు. అలాగే కేంద్ర రైల్వేశాఖ, పౌరవిమానయాన శాఖ, విద్యుత్,బొగ్గు, పునరుత్పాదక ఇంధన శాఖ, టెలికాం మంత్రిత్వ శాఖల కేంద్రమంత్రులు, అధికారులు కూడా ఈ సమావేశానికి హాజరుకానున్నారు. నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాలలో ముఖ్యంగా భద్రత, అభివృద్ధి,కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు, వౌలిక సదుపాయాల కల్పన ఈ సమావేశం అజెండాలో అంశాలుగా ఉన్నాయి. స్థానిక ప్రజల హక్కులు, పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి, భద్రతలపై బహుళ స్థాయి వ్యూహాన్ని కేంద్రప్రభుత్వం సిద్ధ చేస్తుంది. అలాగే సిఆర్‌పిఎఫ్ బెటాలియన్లు, ఇంటెలిజెన్స్,రాష్ట్రాల పోలీసు దళాల సామర్థ్యం పెంచేందుకు కేంద్రం సహాయంపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలలో వౌలిక సదుపాయాల కల్పన, రహదారుల అనుసంధానం, రైల్వేలు, విద్యుత్ మొదలగు వాటిపై రాష్ట్రాలకు కేంద్ర సహాయం వంటివి ఈ సమావేశంలో చర్చిస్తారు. 2016 సంవత్సరంలో ఆయా ప్రాంతాలలో సాధించిన ప్రగతిని చర్చించి,కొత్త వ్యూహాలను ఈ సమావేశంలో దృష్టి సారించనున్నారు. అలాగే నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలలో సంక్షేమానికి ఎదురవువుతున్న సమస్యలపై చర్చించి, అభివృద్ధిని వేగవతం చేసే విధంగా చర్యలను తీసుకోనున్నారు. ఆయా ప్రాంతాలలో సిఆర్‌పిఎఫ్, భారత రిజర్వ్ బెటాలియన్, స్పెషల్ ఇండియా రిజర్వ్ బెటాలియన్లు పోషిస్తున్న పాత్ర, ఎదుర్కొంటున్న సమస్యలు, రాష్ట్రాల పోలీసు దళాలలో ఖాళీలు, ఇంటెలిజన్స్ విభాగాల సామర్థ్యం, మంత్రిత్వశాఖల వారీగా అన్ని అంశాలను చర్చిస్తారు. ఈ సమావేశానికి ఏపినుంచి ఉపముఖ్యమంత్రి చినరాజప్ప, అధికారులు,తెలంగాణ అధికారులు హాజరుకానున్నారు. గత నెలలో చత్తీస్‌గఢ్‌లో 27మంది సిఆర్‌పిఎఫ్ జవాన్లను బలిగొన్న మావోయిస్టులను అణచివేసేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించడం తెలిసిందే.