జాతీయ వార్తలు

బర్దన్ అంత్యక్రియలు పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 4: భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) మాజీ ప్రధాన కార్యదర్శి ఎబి బర్దన్‌కు శనివారం ఇక్కడ నిగంబోధ్ ఘాట్‌లోని విద్యుత్ స్మశానవాటికలో అంత్యక్రియలు జరిగాయి. మధ్యాహ్నం 3 గంటలకు పార్టీ పద్ధతిలో ఆయనకు కడసారి వీడ్కోలు పలికారు. చాలా కాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న బర్దన్ శనివారం కన్నుమూశారు. దివంగత నేతకు పార్టీలకు అతీతంగా నేతలు తరలివచ్చి ఘన నివాళులర్పించారు. ఉప రాష్టప్రతి హమీద్ అన్సారీ, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్, కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్, సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, కాంగ్రెస్ నేత రాజ్‌బబ్బర్ సహా అనేక మంది సిపిఐ కేంద్ర కార్యాయలం అజయ్ భవన్‌కు వచ్చి బర్దన్ పార్ధీవదేహాన్ని సందర్శించి, నివాళులర్పించారు. ఆయన భౌతికఖాయంపై సిపిఐ జెండా కప్పారు. చైనా ఎంబసీలోని డిసిఎం లీ జిన్ సాంగ్ కూడా దివంగత నేతకు ఘన నివాళులర్పించారు. 92 ఏళ్ల బర్దన్ జిబి పంత్ ఆసుపత్రిలో శనివారం కన్నుమూశారు. దేశ సంకీర్ణ రాజకీయాల్లో ఎబి బర్దన్ కీలక భూమిక పోషించారు.