జాతీయ వార్తలు

దాణా విచారణ కొనసాగించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 8: ఆర్జేడి అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు సుప్రీం కోర్టులో గట్టిదెబ్బ తగిలింది. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పశుదాణా కుంభకోణం కేసులో లాలూపై విచారణ కొనసాగించాల్సిందేనని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. దీనిపై జార్ఖండ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం తప్పుబట్టింది. 1996లో పశుదాణా కేసు వెలుగుచూసింది. సుమారు 900 కోట్ల రూపాయలు కుంభకోణం చోటుచేసుకుంది. ఒక కేసులో ఆర్జేడి అధినేత లాలూ దోషిగా తేలడంతో 2013 అక్టోబర్‌లో మూడేళ్ల జైలుశిక్ష పడింది. అదే ఏడాది లాలూకు సుప్రీం బెయిల్ మంజూరు చేసింది. మిగతా మూడు కేసుల్లో ఆయన నిందితుడిగా ఉన్నారు. అయితే ఒకే కుంభకోణానికి సంబంధించి కాబట్టి వేర్వేరుగా విచారణ జరపాల్సిన అవసరం లేదని జార్ఖండ్ హైకోర్టు తీర్పునిచ్చింది. దీనిపై సిబిఐ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. సోమవారం దాణా కేసును విచారించిన జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ అమిత్వరాయ్‌లతో కూడిన ధర్మాసనం లాలూ వేర్వేరుగా విచారణ ఎదుర్కొనాల్సిందేనని తీర్పునిచ్చింది. జార్ఖండ్ హైకోర్టు తీర్పును ధర్మాసనం పక్కనబెట్టింది. బిహార్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ మిశ్రా, మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సజల్ చక్రవర్తి దాణా కేసులో నిందితులుగా ఉన్నారు. అయితే ఈ కేసులో సిబిఐ తీరును సుప్రీం కోర్టు ఎండగట్టింది. ఇంత ప్రాధాన్యత గల కేసులో దర్యాప్తు సంస్థ విపరీతమైన జాప్యం చేసిందని బెంచ్ అసంతృప్తి వ్యక్తం చేసింది. లాలూ ప్రసాద్ హయాంలో ట్రెజరీ నుంచి అక్రమంగా నిధులు విత్‌డ్రా అయ్యాయని అభియోగం. బిహార్‌లోని వివిధ జిల్లాల్లో పశు సంవర్దక శాఖ ద్వారా 900 కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది. ఇదిలావుంటే, దాణా కేసులో నాలుగింటిలోనూ లాలూ ప్రసాద్ యాదవ్ విచారణ ఎదుర్కోవాలని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును బిహార్ బిజెపి శాఖ హర్షించింది. తాజా తీర్పుతో లాలూ రాజకీయ జీవితం ముగిసినట్టేనని పార్టీ సీనియర్ నేత సుశీల్‌కుమార్ మోదీ అన్నారు.