జాతీయ వార్తలు

వెంకయ్యకు అరుదైన గౌరవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐరాస ఆవాస పాలక మండలి అధ్యక్ష పదవికి భారత్ ఎన్నిక
రెండేళ్ల పాటు పదవిలో
కొనసాగనున్న వెంకయ్య
అభినందిస్తూ మోదీ ట్వీట్

న్యూఢిల్లీ, మే 8: ఐక్యరాజ్య సమితి పరిధిలోని (యుఎన్-హాబిటేట్) ఆవాస పాలకమండలి అధ్యక్ష పదవికి భారతదేశం ఏకగ్రీవంగా ఎన్నికైంది. కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి హోదాలో ఎం వెంకయ్యనాయుడు పాలక మండలి అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. కెన్యాలో జరిగిన 26వ పాలక మండలి సర్వసభ్య సమావేశంలో ఆవాస మండలి అధ్యక్ష పదవికి భారత్‌ను ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. ప్రపంచంలో సామాజిక, పర్యావరణపరంగా నిలుదొక్కుకోగల నివాసాలను నిర్మించటం ఈ మండలి ప్రధాన లక్ష్యం. ప్రస్తుతం కెన్యా పర్యటనలోవున్న వెంకయ్యనాయుడు ఐరాసా నివాస పాలక మండలి గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి అధ్యక్షత వహించటం గమనార్హం. వెంకయ్యనాయుడు రెండేళ్లపాటు ఆవాస మండలి గవర్నింగ్ కౌన్సిల్ సర్వసభ్య సమావేశానికి అధ్యక్షత వహిస్తారు.
ప్రధాని మోదీ అభినందన
ఐక్యరాజ్య సమితి ఆవాస మండలి గవర్నింగ్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఎన్నికైన కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి వెంకయ్యను అభినందిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. అత్యంత సమర్థంగా పని చేయటంతోపాటు భవిష్యత్ నగరాల ఆవిర్భావానికి వెంకయ్య కృషి చేస్తారనే పూర్తి విశ్వాసాన్ని మోదీ వ్యక్తం చేశారు.