జాతీయ వార్తలు

సోనియాకు మనీలాండరర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 17: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరంపై బిజెపి రాజ్యసభ సభ్యుడు సుబ్రహణ్యం స్వామి మరోసారి విమర్శలకు దిగారు. చిదంబరం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ‘మనీ లాండరర్’ అని ఆభివర్ణించారు. ఇంతకుముందు చిదంబరంపై తాను చేసిన ఆరోపణలను స్వామి పునరుద్ఘాటిస్తూ, తన కుమారుడికి ప్రయోజనం చేకూర్చేందుకు వీలుగా చిదంబరం విదేశీ పెట్టుబడుల ప్రమోషన్ బోర్డు (ఎఫ్‌ఐపిబి) అనుమతులు ఇచ్చారని ఆరోపించారు. చిదంబరం అత్యంత అవినీతిపరుడని, సోనియా గాంధీకి మనీ లాండరర్‌గా కూడా ఉన్నాడని, కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు చేసిన ప్రమాణంలో పేర్కొన్న ప్రతి చట్టాన్ని ఆయన ఉల్లంఘించారని సుబ్రహ్మణ్య స్వామి ఆరోపించారు. తన కుమారుడు లంచం తీసుకోవడానికి అనువుగా ఉన్నాయి కనుకనే ఎఫ్‌ఐపిబి అనుమతులు ఇచ్చారని, భవిష్యత్తులో ఏ మంత్రి కూడా ఇలాంటి పనులు చేయకుండా ఉండడానికి ఇలాంటి వారిని శిక్షించాలని అన్నారు.

తన కుమారుడికి ప్రయోజనం చేకూర్చేందుకు చిదంబరం ఉద్దేశపూర్వకంగా చట్టవ్యతిరేకమైన పని చేసినట్లు కనీసం 16 ఎఫ్‌ఐపిబి క్లియరెన్స్‌లు చాలా స్పష్టంగా చెప్తున్నాయని ఆయన చెప్పారు.
ఆర్థిక మంత్రిత్వ శాఖలోని కొంతమంది అధికారులు చిదంబరానికి అనుకూలురని, వారి నియామకాన్ని తాను వ్యతిరేకించానని, ఆయితే ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వారినే కొనసాగించాలని పట్టుబట్టారని అన్నారు. అంతేకాదు దాడులద్వారా తన గొంతును నొక్కేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్న చిదంబరం వాదనను సైతం ఆయన ఎద్దేవా చేస్తూ, ఒక లాయరుగా చిదంబరం ప్రొఫెషన్‌ను సైతం ఎగతాళి చేశారు. ‘ఆయనకు ఏమి గొంతుక ఉంది? ఆయనేమీ మేధావి కాదు, ఎందుకంటే ఆయన రిసెర్చ్ వ్యాసాలు రాస్తారు. ఇక లాయరుగా ఆయన వృత్తి స్టేలు పొందడానికి మాత్రమే ఉపయోగపడుతోంది. ఆయన వాదనకు ఎలాంటి కారణాలు లేవు’ అని స్వామి అన్నారు. అంతేకాదు, సోదాలు జరిపినందుకు ప్రభుత్వంపై మండిపడడం ఎందుకని స్వామి ప్రశ్నిస్తూ, దమ్ముంటే తనపై మోపిన ఆరోపణల్లో ఎలాంటి పసా లేదని నిరూపించుకోవాలని కూడా చిదంబరానికి సవాలు విసిరారు.