జాతీయ వార్తలు

ససేమిరా..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 17: ‘మా పార్టీ అభ్యర్థినే రాష్టప్రతి భవన్‌కు పంపిస్తాం. ప్రస్తుత రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ పట్ల ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ, ఆయనకు మరోసారి అవకాశం ఇవ్వడం సాధ్యం కాదు’ అని బిజెపి హైకమాండ్ ప్రతిపక్షానికి స్పష్టం చేసినట్టు తెలిసింది. బిజెపి రాజకీయ చరిత్రలో తొలిసారి పార్టీ అభ్యర్థిని రాష్టప్రతిగా ఎన్నుకునే అవకాశం వచ్చింది. దీన్ని ఎలా జారవిడుచుకుంటాం’ అని ప్రతిపక్షాన్ని ప్రశ్నించినట్టు బిజెపి నేతలు అనధికారికంగా చెబుతున్నారు. ప్రణబ్ ముఖర్జీకి రెండోసారి అవకాశమిచ్చేందుకు బిజెపి అంగీకరిస్తే, ఏకగ్రీవానికి ఒప్పుకుంటామంటూ ప్రతిపక్షం ఇటీవల అధికార పార్టీకి సంకేతాలు పంపటం తెలిసిందే. ఏకగ్రీవం పేరిట కాంగ్రెస్ సీనియర్ నాయకుడైన ప్రణబ్ ముఖర్జీని కొనసాగించటం ద్వారా బిజెపిని దెబ్బ తీసేందుకు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ చేయించారు. తరువాత పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ ద్వారా ఏకగ్రీవ ప్రతిపాదనకు మద్దతు ఇప్పించారు. వామపక్షాలతోపాటు యూపీఏ మిత్రపక్షాలు సోనియా ప్రతిపాదనకు మద్దతిచ్చాయి. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ప్రణబ్ ముఖర్జీని ఎరగా చూపించటం ద్వారా ఆమె మమతా బెనర్జీని తనవైపు తిప్పుకుని ఏకగ్రీవం పేరిట బిజెపిని ఇరకాటంలో పడేసేందుకు ప్రయత్నించారు. అయితే బిజెపి హైకమాండ్ ఎలాంటి రాజకీయ మొహమాటానికి తావివ్వకుండా, తాము ఎంపిక చేసిన వ్యక్తి మాత్రమే రాష్టప్రతి భవన్‌లో అడుగు పెడతారని నితీష్‌కుమార్‌కు స్పష్టమైన సందేశం పంపించినట్టు తెలిసింది. కాంగ్రెస్ విముక్త భారత్ లక్ష్య సాధన కోసం కృషి చేస్తున్న తాము, సీనియర్ కాంగ్రెస్ నాయకుడైన ప్రణబ్ ముఖర్జీని రాష్టప్రతిగా రెండోసారి ఎలా అంగీకరిస్తామని సీనియర్ బిజెపి నాయకుడు ఒకరు బీహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ని కుండబద్దలకొట్టి ప్రశ్నించారని అంటున్నారు. ‘బిజెపి నాయకుడిని రాష్టప్రతిగా ఎన్నుకునేందుకు మొదటిసారి అవకాశం వచ్చింది. మా పార్టీ అభ్యర్థినే ఎన్నుకునేందుకు అవసమైన మెజారిటీ మా వద్ద ఉన్నప్పుడు, బయటివారిని ఎలా ఎన్నుకుంటామని ఆ నాయకుడు ప్రతిపక్ష నేతలను నిలదీసినట్టు తెలిసింది. కొత్త రాష్టప్రతిని ఎన్నుకునేందుకు అవసరమైన పూర్తి మెజారిటీ బిజెపికి ఉంది. అందుకే బిజెపి అభీష్టాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతిపక్షంపై ఉందని ఆయన ఉచిత సలహాకూడా ఇచ్చారని అంటున్నారు. కాంగ్రెస్‌తో ఎలాంటి సంబంధంలేని నాయకుడిని రాష్టప్రతిగా ఎన్నుకునే అవకాశం తమకున్నపుడు, ఇతరులను రానిస్తామా? అని బిజెపి నేతలు అంటున్నారు. ప్రతిపక్షం పట్టుదలతో ఉంటే తమ అభ్యర్థిని రంగంలోకి దింపుతామని ప్రతిపక్షానికి బిజెపి స్పష్టం చేసిందనీ చెబుతున్నారు.
ఇదిలావుంటే, రాష్టప్రతి అభ్యర్థిని ఎంపిక చేసేందుకు బిజెపి జూన్‌లో ఆర్‌ఎస్‌ఎస్ అధినేతలతో సమావేశం కానుంది. రాష్టప్రతి పదవికి లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, జార్కండ్ గవర్నర్ ద్రౌపది ముర్ము, కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి ఎం వెంకయ్యనాయుడు పోటీ పడుతున్నారనే వార్తలు రావటం తెలిసిందే. అయితే నరేంద్ర మోదీ ఈ అంశంపై ఇంతవరకూ ఎలాంటి వ్యాఖ్యా చేయలేదు. మోదీ మనసులో ఎవరున్నారనేది ఎవ్వరికీ అంతుపట్టటం లేదు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి పదవికి యోగి ఆధిత్యనాథ్‌ను ఎంపికచేసి అందరినీ ఆశ్చర్యపరిచినట్టు, ఆయన రాష్టప్రతి పదవికీ ఎవ్వరూ ఊహించని వ్యక్తిని ఎంపికచేసి మరోసారి ఆశ్చర్యపర్చవచ్చనే చర్చ పార్టీలో వినిపిస్తోంది. ఇదిలావుంటే, బిజెపికి గట్టి పోటీ ఇచ్చేందుకు ప్రతిపక్షం తామందరికీ ఆమోదయోగ్యమైన వ్యక్తికోసం వెతుకుతోంది. రాష్టప్రతి పదవి కోసం జాతిపిత మహాత్మాగాంధీ మనుమడు గోపాలకృష్ణ గాంధీ అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా పరిశీలిస్తున్నట్టు వార్తలు రావటం తెలిసిందే.