జాతీయ వార్తలు

ఏ1గా సికింద్రాబాద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 17: దేశవ్యాప్తంగా అత్యంత స్వచ్ఛతగల ఏ-1 కేటగిరీ స్టేషన్లుగా విశాఖపట్నం, సికింద్రాబాద్ రేల్వే స్టేషన్లు నిలిచాయి. ఈ స్టేషన్లకు ఒకటి, రెండు స్థానాలు లభించగా, నాలుగో స్థానంలో విజయవాడ రైల్వే స్టేషన్ నిలిచింది. అలాగే అత్యంత స్వచ్ఛతగల ఏ కేటగిరీ విభాగంలో ఖమ్మం, మంచిర్యాల, వరంగల్ రైల్వే స్టేషన్లు స్థానాలు దక్కించుకున్నాయి. రైల్వే స్టేషన్లలో స్వచ్ఛతపై థర్డ్ పార్టీ తయారు చేసిన ర్యాంకులను రైల్వే మంత్రి సురేష్ ప్రభు బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా స్వచ్ఛ రైల్ పోర్టల్‌ను ప్రారంభించారు. అత్యంత స్వచ్చత పాటిస్తున్న రైల్వే స్టేషన్లు ఏ-1 కేటగిరీలో వరుసగా విశాఖ, సికింద్రాబాద్, జమ్ముతావి, విజయవాడ, ఆనంద్‌విహార్ టర్మినల్, లక్నో, అహ్మదాబాద్, జైపూర్, పూణే, బెంగళూరు సిటీ తొలి పది స్టేషన్లుగా నిలిచాయి. ఏ కేటగిరీ విభాగంలో బియాస్, ఖమ్మం, అహ్మద్‌నగర్, దుర్గాపూర్, మంచిర్యాల, బద్నెర, రంగ్ ఇయాజంక్షన్, వరంగల్, దమో, భుజ్ తొ పది స్థానాల్లో నిలిచాయి. రైల్వే స్టేషన్ల్‌లో పార్కింగ్ ప్రాంతం,
ప్రవేశ ద్వారం, ప్లాట్‌ఫాంలు, వేచి ఉండే గది, ఆయా స్టేషన్లలో ప్రయాణికుల స్పందన, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని ర్యాంకులను ప్రకటించారు. అలాగే రైల్వే జోన్ విభాగంలో ఆగ్నేయ మధ్య రైల్వే, తూర్పు కోస్తా రైల్వే, సెంట్రల్ రైల్వే, దక్షిణ మధ్య రైల్వే వరస స్థానాల్లో నిలిచాయి.