జాతీయ వార్తలు

ఆర్థిక నేరాలకు కళ్లెం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 18: విదేశాలకు పారిపోవడం ద్వారా భారతీయ చట్టాల ప్రక్రియనుంచి తప్పించుకుంటున్న ఆర్థిక నేరాల భరతం పట్టడానికి కేంద్ర ప్రభు త్వం ఒక కొత్త చట్టాన్ని తీసుకు వస్తోం ది. ‘పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థుల బిల్లు-2017’ పేరుతో రూపొందించిన ఈ ముసాయిదా బిల్లు వివరాలను ప్రభుత్వం గురువారం వెల్లడించింది. ‘న్యాయపరమైన చర్యలనుంచి తప్పించుకోవడానికి భారీ ఆర్థిక నేరాలకు పాల్పడిన వారు భారత్‌నుంచి పారిపోతుండడం ఈ దేశ చట్టాలకు విఘాతంగా మారుతోందనే భావన దేశంలో బలంగా ఉంది. అందువల్ల ఇలాంటి చర్యలను అదుపు చేయడానికి ఒక సమర్థవంతమైన, సత్వర పరిష్కారాన్ని కనుగొనే, రాజ్యాంగపరంగా అనుమతించిన ఒక పటిష్టమైన చట్టం అవసరమని భావిస్తున్నాం’ అని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలియజేసింది. ఇలా దేశంనుంచి పారిపోయిన ఆర్థిక నేరగాళ్లు సంబంధిత లీగల్ ఫోరమ్‌ముందు లొంగిపోయే వరకు వారి ఆస్తులను జప్తు చేయడానికి చట్టంలో మార్పులు తీసుకు రావడం లేదా ఒక కొత్త చట్టానే్న తీసుకు రావాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు 2017-18 బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఏర్పాటు చేసే ప్రత్యేక కోర్టు ఇలాంటి ఆర్థిక నేరాలకు పాల్పడిన వ్యక్తిని పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడిగా ప్రకటించడానికి ఈ బిల్లు వీలు కల్పిస్తుంది. సంబంధిత నేరానికి పాల్పడి, అరెస్టు వారెంట్ జారీ అయిన, క్రిమినల్ ప్రాసిక్యూషన్‌ను తప్పించుకోవడానికి, లేదా క్రిమినల్ ప్రాసిక్యూషన్‌ను ఎదుర్కోవడానికి భారత్‌కు తిరిగి రావడానికి నిరాకరించే వ్యక్తిని పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడిగా పరిగణిస్తారు. షెడ్యూల్డ్ నేరాలకు సంబంధించి ఈ బిల్లులో ఒక జాబితా ఉంటుంది. అంతేకాకుండా ఇలాంటి కేసుల కారణంగా కోర్టులపై ఎక్కువ భారం పడకుండా చూడడం కోసం వందకోట్లు, అంతకు పైబడిన విలువ కలిగిన కేసులను మాత్రమే ఈ బిల్లు పరిధిలో తీసుకు వస్తారని ఆ ప్రకటన తెలిపింది. కాగా, ఈ ముసాయిదా బిల్లుపై జూన్ 3 దాకా ప్రజలు, సంబంధిత భాగస్వాములందరినుంచి సలహాలు, సూచనలను ప్రభుత్వం కోరింది.