జాతీయ వార్తలు

మేము ఒప్పుకోం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, మే 18: తమ ఆంతరంగిక భద్రతా వ్యవహారాల్లో జోక్యం చేసుకునే అధికార పరిధి అంతర్జాతీయ న్యాయస్థానానికి ఎంత మాత్రం లేదని పాకిస్తాన్ స్పష్టం చేసింది. గూఢచర్య నేరాలపై జాధవ్‌కు మరణ శిక్ష అమలును తదుపరి ఉత్తర్వుల వరకూ నిలిపివేస్తూ ఐసిజె తీర్పు నివ్వడంతో నిర్ఘాంత పోయిన పాక్ తన అక్కసును చాటుకుంది. తమ ఆంతరంగిక భద్రతా వ్యవహారాల్లో ఐసిజె అధికార పరిధిని తాము అంగీకరించడం లేదని తెలిపింది. జాధవ్ కేసును అంతర్జాతీయ న్యాయస్థానానికి తీసుకెళ్లడం ద్వారా భారత్ తన అసలు రూపాన్ని దాచుకునే ప్రయత్నం చేసిందని పాకిస్తాన్ విదేశాంగ కార్యాలయ ప్రతినిధి నఫీజ్ జకారియా నిప్పులు చెరిగారు. భారత దేశ అసలు స్వరూపాన్ని ప్రపంచ దేశాల ముందు ఎండగడతామని పాకిస్తాన్ అధికారిక టెలివిజన్‌లో జకారియా అన్నారు. తాను గూఢచర్యం, ఉగ్రవాద కార్యకలాపాలు, విచ్ఛిన్నకర కార్యకలాపాలకు పాల్పడిన వాస్తవాన్ని జాధవ్ రెండుసార్లు ఒప్పుకున్నారని చెప్పారు. తమ జాతీయ భద్రత అంశాల్లో జోక్యం చేసుకుంటే అంగీకరించేది లేదన్న విషయాన్ని అంతర్జాతీయ న్యాయస్థానానికి ఇప్పటికే తెలియజేశామన్నారు. అసలు ఇలాంటి వ్యవహారాల్లో జోక్యం చేసుకునే న్యాయపరమైన అధికార పరిధి ఐసిజెకు లేనే లేదంటూ జకారియాను ఉటంకిస్తూ దునియా టీవీ తెలిపింది. జాధవ్ కేసును మానవ హక్కులకు సంబంధించిన కేసుగా ప్రచారంలోకి తెచ్చేందుకు భారత్ ప్రయత్నిస్తోందని, ఆ విధంగా ఆయన ఉగ్రవాద కార్యకలాపాలపై ప్రపంచ దేశాల దృష్టి పడకుండా వ్యవహరిస్తోందని జకారియా ఇంతకు ముందు వ్యాఖ్యానించారు.