జాతీయ వార్తలు

యుద్ధం వచ్చినప్పుడు మిమ్మల్ని పిలుస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, మే 19: తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ రాజకీయ ప్రవేశంపై రాష్ట్రంలో ఇప్పుడు ఊహాగానాలు జోరుగా సాగుతున్న విషయం తెలిసిందే. దాదాపు ఎనిమిదేళ్ల విరామం తర్వాత ఈ వారం ప్రారంభంలో తన అభిమానులతో ప్రాంతాల వారీగా సమావేశమైన రజనీకాంత్ తొలి రోజే తన రాజకీయ ప్రవేశంపై ఒక విధంగా స్పష్టత ఇచ్చారు కూడా. తనకు రాజకీయాల పట్ల ఆసక్తి లేదని అంటూనే ఒక వేళ భగవంతుడి నిర్ణయం అదే అయితే తాను రాజకీయాల్లోకి వస్తానని చెప్పారు. దీనిపై కూడా ఆయన వీరాభిమానులు రకరకాలుగా వ్యాఖ్యానాలు చెప్తున్నారు. రాజకీయాల్లోకి రావడానికి తలైవా ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకున్నారని, నిర్ణయం ప్రకటించడమే తరువాయి అని వారు చెప్తున్నారు. అంతేకాదు జయలలిత మరణం తర్వాత తమిళనాడు రాజకీయాల్లో ఏర్పడిన శూన్యాన్ని భర్తీ చేయడం రజనీకాంత్ వల్ల మాత్రమే సాధ్యమవుతుందని కూడా వారంటున్నారు.
ఈ నేపథ్యంలో అభిమానులతో భేటీల చివరి రోజయిన శుక్రవారం రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు అభిమానుల ఆశలకు మరింత ఊపిరి పోశాయి. శుక్రవారం తన అభిమానులనుద్దేశించి రజనీకాంత్ మాట్లాడుతూ, ‘యుద్ధం వచ్చినప్పుడు నేనే మిమ్మల్ని పిలుస్తాను’ అని అన్నారు. అంతేకాదు పూర్వకాలంలో యుద్ధం వచ్చినప్పుడు మగవాళ్లంతా యుద్ధానికి వెళ్లే వారని కూడా ఆయన అన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య వ్యవస్థ భ్రష్టు పట్టిపోయిందని, దీన్ని మనమంతా కలిసి మార్చాల్సిన అవసరం కూడా ఉందని ఆయన అన్నారు. తన ప్రసంగంలో రజనీకాంత్ రాష్ట్రంలో ఎందరో మంచి నేతలు ఉన్నారంటూ డిఎంకె నేత కరుణానిధి కుమారుడు స్టాలిన్, పిఎంకె నేత అన్బుమణి రాందాస్ పేర్లను ప్రధానంగా ప్రస్తావించారు.
తమిళ రాజకీయాలకు పనికిరారు: స్వామి
కాగా, రజనీకాంత్ చేన వ్యాఖ్యలపై తమిళనాడు రాజకీయ నేతలు సైతం తమదైన రీతిలో స్పందించారు. బిజెపి నేత, రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి అయితే మరో అడుగు ముందుకు వేసి తమిళనాడు రాజకీయాలకు రజనీకాంత్ సరిపోరంటూ వ్యాఖ్యానించారు. తమిళనాడు రాజకీయాల్లో చదువుకొన్న యువత ఎక్కువగా ఉందని, వారంతా కూడా జాతీయ దృష్టికోణంలో రాజకీయాలను చూస్తున్నారని ఆయన అంటూ, పెద్దగా చదువుకోని రజనీకాంత్ ప్రస్తుత రాజకీయాలకు పనికి రారని అభిప్రాయ పడ్డారు. మరోవైపు స్టాలిన్ సైతం రజనీ వ్యాఖ్యాలపై స్పందిస్తూ బిజెపి విషయంలో జాగ్రత్తగా ఉండాలంటూ సలహా ఇచ్చారు. కాగా, రజనీకాంత్ మంచి వారే కానీ తమిళనాడుకు ఇప్పుడు కావలసింది డాక్టర్ కానీ యాక్టర్ కాదని పిఎంకె నేత డాక్టర్ అన్బుమణి రాందాస్ వ్యాఖ్యానించారు.

జార్ఖండ్‌లో కాల్పులు

నలుగురు మృతి ఆరుగురికి గాయాలు ఇసుక కాంట్రాక్టర్ ఘాతుకం

గార్వా/మెదినీనగర్, మే 19: జార్ఖండ్‌లో ఇ సుక మాఫియా దురాఘతాలకు అడ్డూఅదుపూలేకుండా పోయింది. అక్రమ ఇసుక తవ్వకాలను అడ్డుకున్నారన్న ఆగ్రహంతో ఓ ఇసుక కాంట్రాక్టర్ జరిపిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందారు. దీనికి ప్రతీకారంగా గ్రామస్తులు జరిపిన దాడిలో కాంట్రాక్టర్ వద్ద పనిచేస్తున్న ఉద్యోగి మృతి చెందాడు. ఈ ఘర్షణల్లో నలుగురు మృతి చెందగా, ఆరుగురు గాయపడ్డా రు. డిఐజి విపుల్ శుక్లా కథనం ప్రకారం గార్వాలో సంషాన్ ఘాట్‌లోంచి కాంట్రాక్టర్ అక్రమంగా ఇసుక తవ్వుతున్నాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు రేవువద్దకు తరలివచ్చి కాంట్రాక్టర్‌ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఆగ్రహించిన కాంట్రాక్టర్ తుపాకీతో కాల్పులు జరపగా ఉయద్‌సింగ్(55), అతని కుమారులు నిరంజన్(35), విమలేశ్(30) అక్కడికక్కడే చనిపోయారు. మరో ఆరుగురు గాయపడ్డారు. ఈ ఘటనతో రెచ్చిపోయిన గ్రామస్తులు విధ్వంసానికి పాల్పడ్డారు. ఓ ఉద్యోగిని దాడి చేసి చంపేశారు. అలాగే 21 వాహనాలకు నిప్పుపెట్టారని డిఐజి తెలిపారు. 15 ట్రక్కులు, రెండు ఎర్త్‌మూవర్స్, మూడు బైక్‌లు,ఒక కారుకు నిప్పుపెట్టారు.

గిలానీపై ఎన్‌ఐఎ కేసు
న్యూఢిల్లీ, మే 19: విద్రోహ కార్యకలాపాలకు పాల్పడటంతో పాటు లష్కర్ ఎ తోయిబా (ఎల్‌ఇటి) చీఫ్ హఫీజ్ సరుూద్ నుంచి నిధులు స్వీకరించిన ఆరోపణలపై సయ్యద్ అలీ షా గిలానీ సహా నలుగురు అతివాద కాశ్మీర్ వేర్పాటువాదులపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) శుక్రవారం ప్రాథమిక దర్యాప్తు (ప్రిలిమినరీ ఎంక్వైరి) కోసం కేసు నమోదు చేసింది. ప్రాథమిక దర్యాప్తును ఎదుర్కొంటున్న మిగతా ముగ్గురిలో నరుూంఖాన్, ఫరూక్ అహ్మద్ దర్ అలియాస్ ‘బిట్టా కరాటే’, తెహ్రీక్ ఎ హురియత్‌కు చెందిన గాజి జావెద్ బాబా ఉన్నారని ఎన్‌ఐఎ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థల నుంచి నిధులు స్వీకరించినట్టు నరుూంఖాన్ ఒక స్టింగ్ ఆపరేషన్‌లో అంగీకరించినట్టు భావిస్తున్న వీడియో టెలివిజన్‌లో ప్రసారమయింది.