జాతీయ వార్తలు

విష్ణుప్రయాగలో విపత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విరిగిపడిన కొండచరియలు
చిక్కుకుపోయిన 1500మంది భక్తులు

గోపేశ్వర్, మే 19: ఉత్తరాఖండ్‌లోని విష్ణుప్రయాగ వద్ద కొండ చరియలు విరిగిపడటంతో చార్‌ధామ్ యాత్రకు అంతరాయం కలిగింది. చమోలీ జిల్లాలో రిషికేష్- బద్రీనాథ్ జాతీయ రహదారిపై శుక్రవారం సాయంత్రం ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనతో దాదాపు పదిహేనువందల మంది యాత్రికులు హైవేపైనే చిక్కుకుపోయారు. రహదారిపై కొండచరియలను తొలగించేందుకు సరిహద్దు రహదారి సంస్థ సిబ్బంది రంగంలోకి దిగారు. భారీ వాహనాలతో పెద్ద పెద్ద రాళ్లను తొలగిస్తున్నారని చమోలీ కలెక్టర్ ఆశిష్ జోషి తెలిపారు. జోషిమఠ్, కర్ణప్రయాగ, పిపాల్‌కోటి, గోవింద్‌ఘాట్, బద్రీనాథ్ తదితర ప్రాంతాల్లో పదిహేను వందల మంది చిక్కుకుపోయినట్లు ఆయన వివరించారు. వీరికి అవసరమైన ఆహారం, నీరును అందించటంతో పాటు ఇతర వౌలిక సౌకర్యాలను కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. శనివారం మధ్యాహ్నానికి రాళ్లన్నింటినీ తొలగించి తిరిగి ప్రయాణాన్ని ప్రారంభించేట్లు చేస్తామని కలెక్టర్ వివరించారు.

చిత్రం... చిక్కుకున్న యాత్రికులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న రెస్క్యూ బృందాలు