జాతీయ వార్తలు

పసుపు బోర్డుకు నో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 20: తెలంగాణకు పసుపు బోర్డు ఇవ్వలేమని కేంద్రం స్పష్టం చేసింది. దానికి బదులు సుగంధ ద్రవ్యాల పార్క్ ఇస్తామని కేంద్ర వాణిజ్య మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. సీతారామన్ శనివారం విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ గత మూడేళ్లలో తమ శాఖ సాధించిన విజయాలను వివరిస్తూ ఈ అంశాన్ని వెల్లడించారు. నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీ కల్వకుంట్ల కవిత చేసిన డిమాండ్‌ను ఆమోదించారా? అని అడగ్గా, పసుపు బోర్డు ఏర్పాటు చేయటం సాధ్యం కాదని స్పష్టం చేశారు. ప్రతి సుగంధ ద్రవ్యానికి బోర్డును ఏర్పాటు చేయలేమని, అయితే నిజామాబాద్‌లో సుగంధ ద్రవ్యాల పార్క్ ఏర్పాటు చేస్తామని నిర్మలా సీతారామన్ చెప్పారు. సుగంధ ద్రవ్యాలన్నింటికి కలిపి ఒక బోర్డు ఉందని, ఇది కాకుండా పసుపు లేదా ఇతర సుగంధ ద్రవ్యాలకు విడిగా బోర్డులు ఏర్పాటు చేసే ప్రతిపాదన కేంద్రం పరిశీలనలో లేదని స్పష్టం చేశారు. ఆయా రాష్ట్రాల్లో లభించే సుగంధ ద్రవ్యాల కోసం ప్రత్యేకంగా ప్రాంతీయ ఏజెన్సీలు లేదా పార్క్‌లు ఏర్పాటు చేయవచ్చునని చెప్పారు. తెలంగాణలో పసుపు బోర్డును ఏర్పాటు చేయాలని ఆ రాష్ట్ర ఎంపీలు పలుమార్లు తనను కలిసి విజ్ఞప్తి చేశారని, అయితే పసుపు కోసం ప్రత్యేకంగా ఒక బోర్డును ఏర్పాటు చేయలేమన్నారు. తెలంగాణలో లభించే రెండు మూడు సుగంధ ద్రవ్యాలకు కలిపి ఒక పార్క్ లేదా ఏజెన్సీని ఏర్పాటు చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని తెలిపారు. విశాఖపట్నం- చెన్నై పారిశ్రామిక కారిడార్‌ను భువనేశ్వర్ మీదుగా కోల్‌కతా వరకు పొడిగించే ప్రతిపాదన పరిశీలనలో ఉన్నదని ఆమె వెల్లడించారు. ఒడిశా విలేఖరి అడిగిన ఒక ప్రశ్నకు బదులిస్తూ చెన్నై-విశాఖపట్నం పారిశ్రామిక కారిడార్‌ను తమ రాష్ట్రానికి పొడిగించాలంటూ ఒడిశానుంచి పలు విజ్ఞప్తులు వచ్చాయి. పశ్చిమ బెంగాల్ నుండి కూడా ఇలాంటి విజ్ఞప్తులు వచ్చాయి. వీటన్నింటిని పరిశీలించిన అనంతరం చెన్నై-విశాఖపట్నం కారిడార్‌ను ఒడిశా మీదుగా కోల్‌కతా వరకు పొడించాలనే ప్రతిపాదనను సానుకూలంగా పరిశీలిస్తున్నామని నిర్మలా సీతారామన్ చెప్పారు.

చిత్రం... కేంద్ర వాణిజ్య శాఖ సాధించిన విజయాలను మీడియాకు వెల్లడిస్తున్న మంత్రి నిర్మలా సీతారామన్