జాతీయ వార్తలు

ట్రిపుల్ తలాక్ అనుచితమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 22: ట్రిపుల్ తలాక్ అంశంపై ఆల్ ఇండియా ముస్లిం లా బోర్డు (ఎఐఎంపిఎల్‌బి) సోమవారం సుప్రీం కోర్టులో 13 పేజీల అఫిడవిట్ దాఖలు చేసింది. అందులో ట్రిపుల్ తలాక్ విధానం సరైందికాదని బోర్డు పేర్కొనడం గమనార్హం. ట్రిపుల్ తలాక్‌ను ఆమోదించవద్దని దేశంలోని ఖ్వాజీలందరికీ సమాచారం ఇస్తామని వెల్లడించింది. ఈ విషయాన్ని బోర్డు అధికారిక వెబ్‌సైట్, పత్రికలు, సామాజిక మాద్యమాల్లో ప్రచారం చేయాలని సలహాబోర్డు సమావేశంలో నిర్ణయించినట్టు తెలిపారు. పెళ్లికుమారుడు ట్రిపుల్ తలాక్ చెప్పి వధువును వదిలించుకోవాలని చూస్తే దానికి ఆమోదం తెలపవద్దని ఖాజీలకు సమాచారం ఇస్తామని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఎఐఎంపిఎల్‌బి కార్యదర్శి మహ్మద్ ఫజులుర్రాహిం బోర్డు తరఫున అఫిడవిట్ దాఖలు చేశారు. ట్రిపుల్ తలాక్ అన్నది షరియత్‌కు వ్యతిరేకమేకాక, అవాంఛనీయమని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. నిఖా సందర్భంలోనే తలాక్ చెప్పబోమని వరుడికి ఖ్వాజీలతో చెప్పిస్తామని వెల్లడించారు. నిఖా సందర్భంగా ఖ్వాజీలకు తలాక్‌కు సంబంధించి పాటించాల్సిన నియమాలు తెలియజేస్తామని బోర్డు స్పష్టం చేసింది. ట్రిపుల్ తలాక్ మంచి సంప్రదాయం కాదని బోర్డు అంగీకరించింది. కాగా ట్రిపుల్ తలాఖ్‌పై వివిధ సంస్థల వాదనలు విన్న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జెఎస్ ఖేహార్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం తన తీర్పును రిజర్వ్‌లో పెట్టింది.